నిజానికి పరీక్షలంటే వ్యక్తిగత ప్రతిభకు ఒక మంచి నిదర్శనం.  ప్రస్తుతం పరీక్షల్లో వచ్చే మార్కుల ఆధారంగానే విద్యార్థి తెలివితేటలను అంచనా వేయడం జరుగుతుంది. ఇక  విద్యార్థులు ఐతే మార్కుల  కోసం పడరాని పాట్లు పడుతుంటారు. ఇక సృజనాత్మకత చదువుల విధానం నుండి బట్టి విధానంతో పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పుడు  ఈ విధానం విద్యార్థుల పాలిట పెద్ద శాపంగా మారుతుంది. ఈ భట్టి విధానంతో సగం మాత్రమే గుర్తుండి మరో సగం జవాబుకోసం ఇతరులపై ఆధారపడం వంటి  పరిస్థితి నెలకొంది.


ఇటీవల యూనివర్సిటి స్థాయిలో కూడ ఇదే విధానం జరుగుతుందా  అనే అనుమానాలు బాగా  వ్యక్తం అవుతున్నాయి. యూనివర్సిటీ స్థాయిలో చదివే డిగ్రి , ఇతర పీజీ కోర్సుల విద్యార్థులు కూడా పక్క వారి కోసం  చూస్తుండడం సర్వసాధరణంగా మారిపోయింది. కొన్ని సార్లు పక్కవారి పేపర్లను మక్కిమక్కికి కాపి కోడుతున్న సందర్భాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ కారణం వల్ల దీంతో పరీక్షల్లో బాగానే మార్కులు తెచ్చుకుంటున్న విద్యార్థులు కూడా సరిగ్గా ప్రతిభ చూపించే సమయానికి చూపించ లేక పోతున్నారు.


ఈ పరిస్థితి  నెలకొనడంతో  పరీక్షలు నిర్వహించే యూనివర్శీటీలు, ఆయా కాలేజీలపై పలు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టెంందుకు పరీక్షహాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయడంతో ఇతర ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇటీవల  కర్నాటకలోని హవేరిలో ఓ కాలేజీ మాత్రం మాస్ కాపియింగ్ జరగకుండా ఒక సరి కొత్త ఆలోచన చేసింది. అసలు విద్యార్థులు తలలు తిప్పి, ఇతర విద్యార్థుల పేపర్లను చుసేకి వీలు లేకుండా తలలపై అట్టపెట్టుకుని పరీక్షలు రాయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం భగత్ కాలేజీకి చెందిన విద్యార్థులకు మిడ్‌టర్మ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షలకు హజరైన విద్యార్థుల అందరికి అట్టపెట్టెలు ఇచ్చారు. వాటిని  కేవలం పరీక్ష పేపరు మీదే చూపు ఉండేవిధంగా అట్టపెట్టెకు ఒక వైపు హోల్ చేసి ఇచ్చారు.


ఇలా చేయడంతో కాలేజీ యాజమాన్యం   తీరుపై ఫైర్ అయిన అధికారులు మండి పడ్డారు. ఈ విషయంపై కాలేజీ యాజమాన్యాన్ని అడగడంతో... మాస్ కాపియింగ్ జరగకుండా విద్యార్థులపై ఎక్స్‌పరిమెంట్ చేస్తున్నామని తెలిపారు. తర్వాత జరిగిన సంఘటనపై వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు అందడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: