అమెరికా, భారత్ మధ్య వాణిజ్య విభేదాలు తగ్గిపోతున్నాయని, అవి త్వరలో అన్నీ పరిష్కారమవుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు సంయుక్ష వార్థిక సమావేశం కోసం అమెరికా వెళ్లిన ఆమె గురువారం పై విధంగా మాట్లాడారు ఆమె. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశముందన్నారు ఆర్ధికమంత్రి. ఇరు దేశాల వాణిజ్య శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలో సానుకూల ఫలితం కనిపిస్తుందన్నారు అని ఆశ భావం వ్యక్త పరిచారు.


భారత్ సహా అన్ని దేశాలు అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని, తమ దేశం అదే కోరుకుంటోందని ఆవిడ అన్నారు. అదే సమయంలో సొంత బలం, వ్యూహాత్మక ప్రయోజనాలు ఖచ్చితంగా కొనసాగించాల్సి ఉంటుందన్నారు. వెనిజులా చమురు పరిశ్రమ పై జనవరిలో అమెరికా కఠిన ఆంక్షలు పెట్టింది. వాస్తవానికి ఈ చర్య గ్లోబల్ కస్టమర్లకు ఆందోళన కలిగించింది. అయితే, ప్రత్యామ్నాయాలతో పాటు భారత రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వెనిజులా క్రూడ్‌ను రష్యన్ మేజర్ రోస్నెఫ్ట్ నుంచి కొనుగోలు జరుగుతోంది. 4 నెలల విరామం తర్వాత సౌత్ అమెరికన్ నేషన్ నుంచి చమురు లోడింగ్‌కు సిద్ధమైంది అక్కడ. దీనిని ఉద్దేశించి అమెరికా ఆంక్షలకు అనుగుణంగా భారత్ తన ఆర్థిక బలాన్ని త్యాగం చేయదన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.


అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని, ఇదే విషయాన్ని చెప్పామని, నిర్దిష్ట సందర్భాలలో భారత్‌కు సొంత వ్యూహాత్మక ప్రయోజనాలు కూడా అసలైనవని నిర్మల చెప్పారు. అదే సమయంలో అమెరికా వ్యూహాత్మక భాగస్వామి బలంగా ఉండాలని మీరు కోరుకుంటారని, బలహీనపడాలని భావించరన్నారు. అమెరికాతో ఉన్న బలమైన భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని, కానీ బలమైన సమాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అనుమతించాలన్నారు ఈ సందర్బంగా నిర్మల.


పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలో భారత్ కంటే అనుకూలమైన దేశం లేదని నిర్మలా సీతారామన్ అంతకుముందు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. నేటికీ అత్యంత వృద్ధి సెందుతున్న దేశాలలో మొదటి దేశం భారత్ అని, తమ దేశంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన కార్మిక శక్తి ఉందని, తమ ప్రభుత్వం సంస్కరణలను చాలానే ప్రవేశపెడుతోందన్నారు. భారత్ ఒక స్వేచ్ఛాయుత, పారదర్శక విధానాల దేశమని, అనుమతులకు ఆలస్యం ఇలాంటి ఉండవు కాబట్టి పెట్టుబడులతో రావాలన్నారు ఆవిడ. విదేశీ పెట్టుబడిదారులకు సమాన అవకాశాలు, కార్పోరేట్ పన్ను తగ్గించినట్లు చెప్పారు ఈ సందర్బంగా.


మరింత సమాచారం తెలుసుకోండి: