1708 సంవత్సరంలో జూన్ 8వ తేదీన కొలంబియాలోని కార్టాజినా తీరంలో సముద్రం మీద ఒక నౌక పేరు శాన్ జోస్. అదో యుద్ధ నౌక, బ్రిటిష్ వారితో యుద్ధం చేసేది ఆ కాలంలో  కానీ అకస్మాత్తుగా అది మంటల్లో చిక్కుకుంది. అర్థరాత్రి కరీబియన్ సముద్రంలో మునిగి, అదృశ్యమైపోయింది. దానిలో ఉన్న పాటు దాదాపు ఆరు వందల మంది మనుషులు కూడా.  అయితే, అందులో రెండు వేల కోట్ల డాలర్ల విలువ చేసే బంగారం, వెండి, ఆభరణాలు కూడా అందులో ఉన్నాయి.


ఆ నౌక శతాబ్దాలుగా సాగరగర్భంలో ఆచూకీ తేలకుండా ఉండిపోయింది. కానీ 2015 సంవత్సరంలో దీని చుట్టూ ఉన్న రహస్యం వీడిపోవటం మొదలైంది. అది ఎక్కడుందో కనుగొన్నామని  కొలంబియా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇలా ప్రకటించి నాలుగు సంవత్సరాలు గడచిపోయాయి. నౌక ఇంకా కొలంబియా సముద్ర జలాల్లో లోనే ఉంది అది 600 మీటర్ల లోతున ఉంది. అయినా సరే... ఆ నౌక తమదని అందులో ఉన్న నిధులు తమకే చెందుతాయనే గొడవ జరుగుతోంది. 


ఇంత వరకు సముద్ర జలాల్లో మునిగిపోయిన నౌకల్లో అత్యంత సంపన్నమైన నౌకగా 'హోలీగ్రెయిల్' అని పేరుపడ్డ శాన్ జోస్ ఖచ్చితంగా ఎక్కడుందన్న విషయాన్ని కొలంబియా ప్రభుత్వం ప్రకటించడం లేదు. కానీ అక్కడ కార్టాజినాకు నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న రొజారియో దీవుల సమీపంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దీవుల్లోని బీచ్‌లకు వెళ్లే పర్యాటకులను అటూ ఇటూ చేరుస్తూ అనేక మోటారుబోట్లు నిత్యం ఈ జలాల మీదుగా చాలానే తిరుగుతుంటాయి. అలా వెళుతున్నపుడు, వస్తున్నపుడు "శాన్ జోస్" అందులోని అపార నిధులు మన కింద నీటి అడుగున ఎక్కడో ఉన్నాయని ఆలోచించకుండా ఉండటం మానవులకు సహజమే.


శాన్ జోస్ యుద్ధ నౌక 1708 సంవత్సరం మే నెలాఖర్లో పనామా లోని పోర్టోబెలో ఓడరేవు నుంచి బయలుదేరింది. నాడు స్పెయిన్ నియంత్రణలో ఉన్నపెరూలో వసులు చేసిన బంగారం, వెండి, విలువైన రాళ్లను ఆ యుద్ధ నౌకలో నింపారు. వాటి విలువ ప్రస్తుతం 1,000 కోట్ల డాలర్ల నుండి 2,000 కోట్ల డాలర్ల వరకూ ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: