కడప జిల్లా....వైఎస్ ఫ్యామిలీ కంచుకోట. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇక్కడ మాత్రం వైఎస్ ఫ్యామిలీదే హవా. వైఎస్ ఉన్నప్పుడు ఈ జిల్లా కాంగ్రెస్ కు అనుకూలంగా నడిచింది. ఇప్పుడు ఆయన తనయుడు జగన్ పెట్టిన వైసీపీకి అనుకూలంగా ఉంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ గాలి వీచిన ఇక్కడ మాత్రం వైసీపీ జోరు కనబరిచింది. మొత్తం 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లలో  వైసీపీ 9 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. టీడీపీ ఒక్క రాజంపేటలోనే గెలిచింది.


ఇక మొన్న ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంత ప్రభంజనంలో కడప జిల్లాలో ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. మొత్తం సీట్లని గెలిచేసుకుని క్లీన్ స్వీప్ చేసేసింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో 30 వేల పైనే మెజారిటీ తో టీడీపీని చిత్తు చేసింది. అయితే ఇలాంటి కడపలో టీడీపీ భవిష్యత్ శూన్యంగానే కనిపిస్తోంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పిన, కడప ప్రజలు వైసీపీకే పట్టం కట్టారు.


ఇక ఇప్పుడు వైసీపీలో అధికారంలో ఉంది. దీంతో ఇప్పుడు ఇక్కడ టీడీపీ ఉందా? అనే అనుమానం వస్తుంది. అసలు ఓటమి పాలయ్యాక నేతలు చెట్టుకొకరు, పుట్టకొకరు అయిపోయారు. సీఎం రమేశ్ లాంటి ఆర్ధికంగా బలంగా ఉన్న నాయకుడు బీజేపీ గూటికి వెళ్లిపోవడంతో, జిల్లాలో టీడీపీని నడిపించే నాథుడే కరువయ్యాడు. అటు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలోకి వెళ్లనున్నారు. మరికొందరు నేతలు వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి సైలెంట్ గా ఉన్నారు.


ఇక రామసుబ్బారెడ్డి లాంటి సీనియర్ నేత కూడా వైసీపీలోకి వెళ్లిపోవాలని చూస్తున్నారు. అటు పులివెందుల లో జగన్ మీద ఓడిపోయిన సతీశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు అడ్రెస్ లేరు. ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్ధులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. ఈ పరిస్తుతులన్నీ చూస్తుంటే కడపలో టీడీపీకి భవిష్యత్ అస్సలు లేదనే చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: