రాష్ట్ర భవిష్యత్‌కు తలమానికంగా నిలవాల్సిన రాజధాని అమరావతి నిర్మాణంపై   వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పూటకోరకంగా ఇష్టానుసారం మాట్లాడుతూ, ఆంధ్రుల  ఆశలను, కలలను తుంచివేసేలా ప్రవర్తిస్తున్నారని తెలుగుదేశంనేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మహ్మద్‌ నసీర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధానిని మంగళగిరిలో పెట్టమని వైసీపీఎమ్మెల్యే ఆర్‌.కే.అంటే, కర్నూలులో పెట్టాలని మరొకాయన అనడం వారి అవగాహనరాహిత్యాన్ని, అజ్ఞానాన్ని తెలియచేస్తోందన్నారు. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా గుంటూరు-విజయవాడల మధ్యరాజధాని ఉండాలని భావించి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సహా అన్నివర్గాలవారు నివసించే ప్రదేశాన్ని అమరావతి నిర్మాణానికి ఎంపికచేశారని నసీర్‌  పేర్కొన్నారు. 

ఒక కాస్మొపాలిటన్‌సిటీలా రాజధాని నిర్మాణం జరగాలన్న సదుద్దేశంతో, నాటిముఖ్యమంత్రి నవనగరాలుగా ఒక మహానగరంగా నిలిచేలా అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించారన్నారు. ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ, మోనార్కులా వ్యవహరిస్తున్న జగన్మో హన్‌రెడ్డి, రాజధాని విషయంలో ఆలోచనలేకుండా నిర్ణయాలు చేస్తున్నాడన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ బాగుండాలని అమరావతి వేగంగా అభివృద్ధి చెందాలనే కాంక్షతో, ఆప్రాంతంలో పెట్టుబడులుపెట్టిన పారిశ్రామికవేత్తలు, సంస్థలు జగన్‌ ఆలోచనావిధానాలవల్ల వెనక్కుమళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని టీడీపీనేత ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వ పనితీరుతో రాష్ట్రంలోని విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో భూముల విలువలు దారుణంగా  పడిపోయి ందన్నారు. 


గుంటూరు, విజయవాడల్లో 60లక్షల జనాభా ఉన్నారని, ఆ రెండుప్రాంతాలను కలుపుతూ నిర్మించతలపెట్టిన అమరావతి నగర నిర్మాణాన్ని నిలిపేసిన ప్రభుత్వం, కేవలం ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎక్కడో మారుమూలప్రాంతాలకు, రోడ్లుకూడాలేని ప్రదేశా లకు రాజధానిని తరలించాలని చూడటం దారుణమని నసీర్‌ వ్యాఖ్యానించారు. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణాన్ని వెంటనే ఆరంభించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. రాజధాని ఎక్కడ ఉండాలనేదానిపై సర్వేలు చేస్తామంటున్న మంత్రి బొత్స, ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా, పక్షపాతంలేకుండా నిర్ణయం తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్ర రాజధానిపై నిర్దిష్టమైన ఆలోచనావిధానంతో ఉండాలని, అమరావతి నిర్మాణంపై ఆయన తక్షణమే ప్రజామోదమైన ప్రకటన చేయాలని నసీర్‌ డిమాండ్‌చేశారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: