ప్రజాధనాన్ని కాపాడాలన్న ఉద్దేశ్యం తో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్న జగన్ సర్కార్ నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తోంది . ఇప్పటికే పోలవరం జల ప్రాజెక్టు , ప్రధాన డ్యామ్ నిర్మాణానికి రివర్స్ టెండరింగ్ కు వెళ్లి ప్రజాధనాన్ని ఆదా చేసిన విషయం తెల్సిందే . నిపుణుల కమిటీ సూచనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పనులకు జగన్ సర్కార్ వెళ్లి 62 .1 కోట్ల రూపాయల మేరకు ఆదా చేసింది .


 ప్రకాశం జిల్లా కు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులను ప్రస్తుత బీజేపీ నేత సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ సంస్థ  597 . 35 కోట్ల రూపాయలకు దక్కించుకుంది . వెలిగొండ రెండవ టన్నెల్ టెండర్  పనుల్లో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింది . రిత్విక్ సంస్థ 4 . 69 శాతం అధిక మొత్తానికి దక్కించుకుందని నిపుణుల కమిటీ గుర్తించింది . దీనితో నిపుణుల కమిటీ సూచనల మేరకు జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించి , టెండర్లను ఆహ్వానించింది . టెండర్లలో మేఘా సంస్థ 491 .6 కోట్ల కు టెండర్ దాఖలు చేసి ఎల్ -1 గా నిలిచింది .


గతం లో రిత్విక్ సంస్థ దక్కించుకున్న మొత్తం   కంటే , ఏడు శాతం  తక్కువ మొత్తానికి పనులను దక్కించుకోవడం ద్వారా 87 కోట్లకు పైగా ప్రయోజనం చేకూరడమే కాకుండా , 62 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనం ఆదా అయినట్లయింది .  గత ప్రభుత్వ హయాం లో ఆహ్వానించిన సాగునీటి ప్రాజెక్టు టెండర్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని భావించిన జగన్ సర్కార్ , రివర్స్ టెండర్లకు వెళ్లాలని నిర్ణయించింది .


మరింత సమాచారం తెలుసుకోండి: