టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం తలపెట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు మద్దతుగా సికింద్రబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ వద్ద బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో పాటు ఆయా డిపోల ఎదుట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది.సీఎం పై మండిపడ్డ విమలక్క.. కార్మికులను అరెస్టు చేయడం తగదన్న ప్రజా గాయకురాలు..ఆర్టీసీ కార్మికులు తమ సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.ముఖ్యమంత్రి మాట్లాడే మాటలకు అర్థం ఉండాలని ఘాటుగా స్పందించారు.


ఆర్టీసి కార్మికుల సమ్మె విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.బంద్ నేపథ్యంలో పలు పరీక్షలు వాయిదా.. ఇబ్బందిపడుతున్న విద్యార్ధిలోకం.బంద్‌ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.విద్యార్దులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.


రెండు వారాలు పైగా సమ్మె చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపలేదని సూటిగా ప్రశ్నించింది.ఆర్టీసీ యూనియన్లతో శనివారం ఉదయం చర్చలు జరపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఆర్టీసీ పై వాదనలు జరుగుతున్న సమయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మెకు మరికొన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు పలికితే ఇక ఎవరూ ఆపలేరని స్పష్టం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: