కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ కు తొలిసారి 2014 జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అపజయం పాలవడం, అలానే టీడీపీ పార్టీ విజయాన్ని అందుకోవడం జరిగింది. అయితే అప్పట్లో టిడిపి పార్టీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీలు మద్దతునివ్వడం జరిగింది. అయితే ఓటమి పాలయినప్పటికీ కూడా ప్రతిపక్ష నేత హోదాలో నిలిచిన జగన్ మోహన్ రెడ్డి గారు, ఆ తరువాత ప్రజాసంకల్ప యాత్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా యాత్ర చేపట్టి, రాష్ట్ర ప్రజలకు ఎంతో చేరువయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అసెంబ్లీ మరియు ఎంపీ సీట్స్ గెలుచుకుని రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టడం జరిగింది. 

ఇక గెలుపు తరువాత మే నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయడం జరిగింది. ఇక ఆయన గద్దెనెక్కి ఇప్పటికే ఐదు నెలలు గడిచి ఆరవ నెల దగ్గర పడుతుండటంతో, ఇప్పటివరకు ఆయన ఆధ్వర్యంలో జరిగిన పాలనపై ఒక సర్వే సంస్థ, పలు ప్రాంతాల ప్రజల వద్దకు వెళ్లి ఒక సర్వేని నిర్వహించడం జరిగిందని సమాచారం. అయితే ఆ సర్వేలో ప్రతిపక్ష పార్టీలకు షాకిచ్చే విధంగా రిజల్ట్స్ బయటకు రావడం జరిగిందని సమాచారం. ఇక వారి ద్వారా చేపట్టబడిన ఆ సర్వేలో దాదాపుగా 70 నుండి 80 శాతం వరకు ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారి పాలన బాగుందని, అక్కడక్కడా ఆయన పాలనలో కొద్దిపాటి లోపాలు ఉన్నప్పటికీ, మొత్తంగా ఈ ఐదు నెలలలో ఆయన ప్రజల సమస్యలు తీర్చడంతో ఎంతో సక్సెస్ అయ్యారని అంటున్నారట. 

ఇక మరొక 20 శాతం మంది మాత్రం జగన్ గారి పాలన అంతగా సంతృప్తికరంగా లేదని, ఆయన నుండి మరింత సమర్ధవంతమైన పాలనను ఆశిస్తున్నట్లు తెలిపారట. అయితే ఇప్పుడు గడిచినవి కేవలం ఐదు నెలలు మాత్రమేనని, ఇక రాబోయే మిగతా నాలుగున్నరేళ్ల వరకు కూడా జగన్ గారు ఈ విధంగానే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని తీర్చే విధంగా పధకాలు చేపట్టి పరిపాలన గనుక చేయగలిగితే, రాబోయే ఎన్నికల్లో కూడా వారికి మరొక్కసారి ప్రజా మద్దతు లభించే అవకాశం ఉంటుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: