ఏపీ ప్రభుత్వం ఇటీవల ఓ జీవో తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఏదైనా పత్రిక ఇష్టానుసారంగా వార్తలు రాస్తే..వాటిపై చర్యలు తీసుకునే అధికారం సదరు శాఖకు చెందిన అధికారులకు వస్తుంది. ఇప్పుడు ఈ జీవో ఏపీ మీడియా సర్కిళ్లో పెద్ద సంచలనం అయ్యింది. జగన్ పత్రికాస్వేచ్ఛను అణిచేస్తున్నారని చంద్రబాబు అనుకూల పత్రికలు గోల చేశాయి. ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ఈ అంశంపై సీరియగ్ స్పందించారు. వెంటనే జీవోను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


కానీ ఏపీ సీఎం జగన్ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటున్నారు. వాస్తవమైన ఆరోపణలు చేస్తే సంబంధిత శాఖలు వాటిపై స్పందించి దిద్దబాట్లు చేసుకుంటాయి. అవినీతి ఉందని తెలిస్తే బాధ్యులను ప్రభుత్వం శిక్షిస్తుంది. కానీ కేవలం ప్రభుత్వానికి పేరు రాకూడదనే కక్షతో, సొంత కుల నాయకుడు ముఖ్యమంత్రి కాలేదనే అక్కసుతో వాస్తవాలను దాచి, ప్రజలను మభ్యపెడుతూ, తప్పుదోవ పట్టించేలా ఉండే కథనాలపై, అబద్ధపు వార్తలపై ఉపేక్షించే సమస్యే లేదని వైయస్ జగన్ స్పష్టం చేసారు.


దీన్ని మీడియా నియంత్రణగా చంద్రబాబు, ఆయన అనుకూల ఎల్లో మీడియా చింత్రించేందుకు చేసే ప్రయత్నాన్ని ఖండించింది ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం. తప్పుడు ప్రేరేపిత నివేదికలపై చర్యలు తీసుకునేందుకు మంత్రివర్గ విభాగాల కార్యదర్శులకు ఇచ్చిన అధికారం మీడియాను నియంత్రించే చట్టం కాదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ విధమైన జీవో ఉందని, దాని అధికారాన్ని వికేంద్రీకరించడం మాత్రమే చేసామని తెలియజేసింది.


అయితే గతంలో ఇలాంటి జీవోను వైఎస్ జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ తీసుకొచ్చారు. కానీ దాన్ని అమలు చేయలేదు. అప్పట్లోనే చంద్రబాబు, పత్రికలు ఈ అంశంపై ధర్నాలు చేస్తే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. కానీ ఇప్పుడు జగన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గే ఆలోచనలో కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: