తెలుగు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైస్సార్సీపీ ఆ తర్వాత కొత్త పథకాల కొత్త విధానాలతో ప్రజలలో మంచి పేరు సంపాదించాలని ఆశతో దృఢసంకల్పంతో ఉన్నది .అలాగే టీడీపీ కూడా ప్రభుత్వం ,ప్రభుత్వ విధానాల పైన తీవ్రంగా విమర్శిస్తూ ప్రజల్లో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షతో ఉంది .అలా ప్రజల లో  తమ ఉనికిని చాటుకొని  2024 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆశతో టిడిపి వర్గాలు  ఎంతో కఠోరంగా  శ్రమిస్తున్నారు.


రెండు తెలుగు రాష్ట్రాల్లో... నెక్ట్స్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తామే అధికారంలోకి వస్తామని జీవీఎల్ అంటున్నారు. అలా అధికారంలోకి వచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాల్నీ బీజేపీ ఇప్పటి నుంచే వెతుక్కుంటోందని ఆయన మాటల్ని బట్టీ అర్థమవుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలంటే రెండు అంశాలు కీలకం. ఒకటి ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పని అయిపోవాలి. ఆ పార్టీపై ప్రజలు చిరాకుపడాలి. ఆ పార్టీని తిప్పికొట్టాలి.

ఇదంతా వైసీపీకి సంబంధించిన బీజేపీ టార్గెట్ అవ్వాల్సి ఉంటుంది. రెండోది ప్రజలు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అలా ఎంచుకోవాలంటే... ప్రస్తుతం ఆల్టర్నేట్‌గా ఉన్న టీడీపీని ప్రజలు పక్కన పెట్టాలి. అది జరిగే పని కాదు కాబట్టి... అసలు టీడీపీయే లేకుండా పోతే... ఇక తామే ఆల్టర్నేట్ అవుతామని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.


ఇలాంటి పరిస్థితుల మధ్య బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బీజేపీతో పొత్తుకు టీడీపీ సంకేతాలు పంపుతోంది కదా... దీనిపై ఏమంటారని అడిగితే... బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు అన్నదే ఉండదన్న ఆయన... అదే టీడీపీని బీజేపీలో కలిపేస్తామంటే (విలీనం) దానిపై హైకమాండ్‌తో మాట్లాడతానన్నారు. ఇది జరిగే పని కాదని మనందరికీ తెలుసు. ఎందుకంటే... విలీనమే జరిగితే టీడీపీ చరిత్రలో కలిసిపోయినట్లే. ఆ పార్టీ అస్థిత్వమే కోల్పోయినట్లు లెక్క.అలా జరగదని జీవీఎల్‌కి కూడా తెలుసు. అయినప్పటికీ ఆయన ఆ మాట ఎందుకన్నారన్నదానిపై చర్చ జరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: