పవన్ కళ్యాణ్ రాజకీయంగా జోరు పెంచాలనుకుంటున్నారు. ఎన్నికల వేళ సభల్లో ప్రసంగాలు చేసిన పవన్ ఆ తరువాత మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు. ఇక పార్టీ అభిప్రాయాన్ని ప్రెస్ నోట్ల రూపంలో, ట్విట్టర్ ద్వారా పవన్ వెల్లడిస్తున్నారు. ఈ నేపధ్యంలో జనసేన కార్యకలాపాలు ఒకింత నిరాశగానే సాగుతుననాయి. దాంతో పవన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది.


నవంబర్ మొదటివారం నుంచి ఏపీవ్యాప్తంగా జిల్లాల టూర్లకు పవన్ రెడీ అవుతున్నారట. ఈ జిల్లాల టూర్ల ముఖ్య ఉద్దేశ్యం జనసైనికులను కాపాడుకోవడం, పార్టీని పటిష్టం చేసుకోవడమే. ఇదే సమయంలో అయిదు నెలల పాలన పూర్తి చేసుకుని అప్పటికి  ఆరవ నెలలోకి అడుగుపెడుతున్న జగన్ సర్కార్ చేసిన తప్పులు ఏమైనా ఉంటే వాటిని జనం మధ్యలోనే ఎండగట్టడం.


మరో విషయం ఏంటంటే జగన్ ప్రవేశపెడుతున్న పధకాల  విషయంలో జనాభిప్రాయం  కూడా డైరెక్ట్ గా వారి నుంచే తెలుసుకోవాలని పవన్ అనుకుంటున్నారుట. ఆ విధంగా కనుక చేస్తే అసలైన జనన్ నాడి పట్టగలమని, దానివల్ల మరింతగా జనం నుంచి నిలిచి పోరాడేందుకు అవకాశం ఉంటుందని పవన్ భావిస్తున్నారుట.


మొత్తం మీద పవన్ మళ్ళీ జనంలోకి రావడం అంటే ఆయన పూర్తిగా రాజకీయాల మీదనే తన ద్రుష్టి ఉంచారన్నది అర్ధమవుతోందని అంటున్నారు. ఇక పవన్ పార్టీ నుంచి ఎవరూ బయటకు పోకుండా చూసుకోవాలని కూడా ఆలోచన చేస్తున్నారుట. మరి పవన్ జిల్లాల టూర్లకు స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మరో వైపు లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్న నేపధ్యంలో పవన్ టూర్ కి ఇపుడు ఎక్కడలేని రాజకీయ ప్రాధాన్యత కూడా ఏర్పడింది. దాంతో పవన్ రాజకీయ వ్యూహాలు కూడా ఈ జిల్లాల టూర్ల ద్వారా వెల్లడి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: