తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తనయుడు మంత్రి కేటీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి. 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన టిఆర్ఎస్ మొదటి ఐదు నెలల పాటు చాలా తక్కువ మంది మంత్రులతో పనిచేసింది. తర్వాత మంత్రి వర్గ విస్తరణలో చోటు సంపాదించుకున్న మంత్రి కేటీఆర్ తన మార్కు పరిపాలనను మొదలుపెట్టారు అనే చెప్పుకోవాలి .టిఆర్ఎస్ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా మంత్రిగా పని చేసిన కేటీఆర్ తన మార్కు అని చూపించారు.

అదేవిధంగా నిన్ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ప్రగతిభవన్ లో జిహెచ్ఎంసి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశిస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్ లో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మత్తులు, గ్రేటర్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని ట్రాఫిక్ ను తగ్గించే ప్రణాళిక రూపొందించి దాన్ని వెంటనే అమలు పరచాలని సూచించారు.

దీనిలో భాగంగా బోరబండ - మియాపూర్ రహదారి నుంచి హైటెక్ సిటీ రోడ్లు ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. దీంతో పాటు సిటీలో సాధ్యమైనన్ని రోడ్ నెట్‌వర్క్‌ను బలోపేతంపై మంత్రి సమీక్షలో చర్చించారు. త్వరితగతిన మిస్సింగ్ లింక్ రోడ్లు నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌ఆర్‌డిసి కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.


అలాగే కేటీఆర్ గారు ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయనకి ఎటువంటి సమస్య గురించి అయినా తెలిస్తే వెంటనే పరిష్కరించాలని తదితర అధికారులను వెంటనే ఆదేశిస్తూ ఉంటారు. ఈ విధంగా మనలో కూడా పొందుతున్నారు కేటీఆర్ గారు.


మరింత సమాచారం తెలుసుకోండి: