తెలంగాణ హై కోర్ట్ నిరుద్యోగులకు బాంబు పేలించ్చింది. నిరుద్యోగులకు ఎవరైతే నేరాభియోగాలు నిరూపణ కాకపోయినా, అభియోగాలు ఉన్నవారు కానిస్టేబుల్‌ వంటి పోస్టుల ఎంపికకు అర్హులు కాదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. వారిపై నమోదైన క్రిమినల్‌ కేసును కింది కోర్టు కొట్టేసిందని, అభియోగాల సమయంలో పోలీస్‌ నియామక మండలి రద్దు చేసిన తన కానిస్టేబుల్‌ ఎంపికను పునరుద్ధరించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న రిట్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. క్రిమినల్‌ కేసుల్లో జోక్యం చేసుకున్నట్లు నేరాభియోగాలు రుజువు కాలేకపోతే, ఆ వ్యక్తి పై మచ్చ లేనట్లు కాదని హై కోర్ట్ స్పష్టం చేసింది.


ఇలాంటి పరిస్థిలు ఉన్న వారి ఎంపికను రద్దు చేసే అధికారం పోలీస్‌ నియామక మండలికి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌ రావు ఇటీవల తీర్పును ఇచ్చారు. ఇదే మాదిరిగా సుప్రీం కోర్టు కూడా తీర్పులు వెలువరించిందని వాటిని ఉదాహరణగా చూపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌ మండలం, రాయకల్‌ గ్రామం చల్లిగడ్డ తండాకు చెందిన కర్రా కృష్ణ కుమార్‌ అనే యువకుడు మెదక్‌ జిల్లా ఆర్మర్డ్‌ రిజర్వు కానిస్టేబుల్‌ గా అర్హత సాధించాడు.


అయితే తర్వాత ఒక క్రిమినల్‌ కేసులో పాత్ర ఉందని, నారాయణఖేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు ఉందని తెలుసుకుని అధికారులు కృష్ణకుమార్‌ కు నోటీసు అందించారు. అతడు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని అధికారులు ఎంపిక జాబితా నుంచి అతని పేరును తీసేసారు. పోలీస్‌ నియామక మండలి అతని కానిస్టేబుల్‌ ఎంపికను రద్దు చేసింది పోలీస్ శాఖ. తన తండ్రి, సోదరుడు తనపై పెట్టిన తప్పుడు కేసును గత ఏడాది కింది కోర్టు కొట్టేసిందని, తనకు కానిస్టేబుల్‌ పోస్టు ఇవ్వాలని చేసుకున్న దరఖాస్తును మండలి పట్టించుకోలేదని కృష్ణ కుమార్‌ హై కోర్టులో రిట్‌ వేశాడు.


దీనితో కింది కోర్టు అతనిపై ఉన్న క్రిమినల్‌ కేసును విచారించిందని, పోలీస్‌ కానిస్టేబుల్‌ వంటి పోస్టులకు ఎంపిక అయ్యే వారిపై నేరాభియోగాలు కూడా ఉండకూడదని హై కోర్టు తీర్పులో పేర్కొంది. పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ వెలువడింది తెలంగాణ ప్రభుత్వం. ప్రాథమిక, శరీర దారుఢ్య పరీక్షల్లోనే కాకుండా రాత పరీక్షలో కూడా పిటిషనర్‌ ఉత్తీర్ణుడయ్యాడు అంతే కాకుండా ఎంపిక జాబితాలో అతని పేరు కూడా ఉంది.


ఈ పరిస్థితులలో అతనిపై క్రిమినల్‌ కేసు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు 2017 సంవత్సరం జూన్‌ 14న అతని ఎంపికను రద్దు చేసింది.ఆ తర్వాత కింది కోర్టు అతని పై క్రిమినల్‌ కేసు కొట్టేయడంతో తాను నిర్దోషినని, కానిస్టేబుల్‌ ఎంపికకు తిరిగి అవకాశం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన రిట్‌ను న్యాయమూర్తి వెతిరేకిస్తూ తీర్పు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: