తప్పులు ఎవరైనా చేస్తుంటారు. వాటిని కప్పి పుచ్చడానికి ఏదో ఒకటి చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే ఆ విషయం బయటికి రావడం జరిగి వారిని శిక్ష అర్హుడిని చేస్తుంది. ఇలాంటి సంగంటనే అమెరికాలో ఒక చోట జరిగింది. ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరావు కాదు మన దేశంకి చెందిన భద్రేశ్‌ కుమార్‌ పటేల్‌. ఈ ప్రబుద్ధుడు తన భార్యను కిరాతకంగా చంపాడు. 


భద్రేశ్‌ కుమార్‌ పటేల్‌ అహ్మదాబాద్‌కు చెందిన వ్యక్తి. ఈయన అమెరికాలోని డంకిన్‌ డోనట్స్‌ స్టోర్‌లో పనిచేస్తున్న అతడు తన భార్యను చంపి పరారు అయ్యాడు. అనంతరం తప్పించుకొని అమెరికా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దర్యాప్తులోనే మేటి అయిన అమెరికా అతని కోసం తెగ వెతుకుతోంది. భారత్‌ లో సహా నాలుగేళ్లుగా ప్రపంచాన్ని జల్లెడ పట్టినా అతడు ఎక్కడ దొరకలేదు. దీనితో ఈ వ్యక్తి అమెరికా దర్యాప్తు సంస్థ (ఎఫ్‌బీఐ) టాప్‌ 10 వాంటెడ్‌ లిస్టులో స్థానం దక్కించుకున్నాడు. దీనితో ఈయన పై ఏకంగా రూ. 70 లక్షల రివార్డు ప్రకటన ఇచ్చారు పోలీస్ అధికారులు.


2015 సంవత్సరం ఏప్రిల్‌ 12 న రాత్రి పనిచేస్తున్న అతడు తన భార్య ఫలక్‌ (21) తో కలసి స్టోర్‌లోని కిచెన్‌ దగ్గరికి వెళ్లాడు. కాసేపటికి ఒక్కడే బయటకు వచ్చాడు ఈయన. కొద్ది గంటల తర్వాత పోలీసులు అమె మృత దేహాన్ని కానీ పెట్టారు. చాలా సార్లు కత్తితో పొడిచి మరీ హత్యచేశాడు హంతకుడు. 


సీసీటీవీ ఫుటేజీల ప్రకారం అతడు ఓ ట్యాక్షి తీసుకోని హోటల్‌ కు వెళ్లి రాత్రంతా పడుకొని తెల్లవారాక మాయమయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ అతడు కనిపించలేదు. ఎఫ్‌బీఐ అతడి కోసం అమెరికాలోనే కాకుండా భారత్‌లోని గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీలలో కూడా జల్లాడ పట్టారు. అమెరికా, భారత్ కలసి చేసిన పెద్ద కేసు విచారణ ఇదే కావడం గమనించాల్సిన విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: