దగ్గుబాటి ఫామిలీ పొలిటికల్ సర్కిల్ లో నిలబడింది . ఎటూ తేల్చుకోలేక సతమతమవుతోంది . దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతుండగా , దగ్గుబాటి  దగ్గుబాటి వెంకటేశ్వరరావు  అయన తనయుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు . ఎన్టీఆర్ హయాం లో జిల్లా రాజకీయాలను శాసించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగాలా ? వద్దా ? అనే డైలమా లో ఉన్నట్లు తెలుస్తోంది . దానికి కారణం లేకపోలేదు .


 ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న పురందేశ్వరిని వైస్సార్ కాంగ్రెస్ లో చేరే విధంగా ఒప్పించాలని ఆ పార్టీ నాయకత్వం వెంకటేశ్వరరావు పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది . బీజేపీ లో కొనసాగుతోన్న ఆమె తరుచూ , పార్టీ నాయకత్వం పై  విమర్శలు చేయడమే దానికి కారణమని అంటున్నారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికల్లో వెంకటేశ్వరరావు , పురందేశ్వరి లు వేర్వేరు పార్టీల తరుపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు .    ఒక దశ లో దగ్గుబాటి తనయుడు పరుచూరు  నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా, సాంకేతిక  సమస్యలు తలెత్తడం తో చేసింది లేక  దగ్గుబాటి పోటీ చేసి స్వల్ప తేడా తో ఓటమి పాలయ్యారు .


 అయితే ఎన్నికల అనంతరం పరుచూరు నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి . గతం లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా పనిచేసిన రావి రామనాధం , తిరిగి పార్టీ లో చేరడం ఆయనకు డిసిబిసి బ్యాంకు చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు పార్టీ నాయకత్వం అంగీకరించిందని ప్రచారం జరుగుతోన్న నేపధ్యం లో పార్టీ లో దగ్గుబాటి పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కకుండా పోయింది .


మరింత సమాచారం తెలుసుకోండి: