మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా మొబైల్ నంబర్ మార్చుకోవాల్సిన అవసరం లేకుండా ఒక ఆపరేటర్ నుండి మరో ఆపరేటర్ కు సులభంగా మారవచ్చనే విషయం తెలిసిందే. 2011 సంవత్సరంలో ట్రాయ్ ప్రవేశపెట్టిన మొబైల్ నంబర్ పోర్టబిలిటీ వినియోగదారుల్ని చాలా ఆకట్టుకుంది. భారత్ టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) నవంబర్ 4వ తేదీ నుండి 10వ తేదీ వరకు మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి ధరఖాస్తు చేసుకోవటం కుదరదని పేర్కొంది. 
 
ట్రాయ్ నవంబర్ 11వ తేదీ నుండి కొత్త విధానం అమలులోకి తెస్తూ ఉండటంతో వారం రోజులు ట్రాయ్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ సేవలను నిలిపివేయనుంది. నూతన విధానం ద్వారా ట్రాయ్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీని సులభంగా మరియు వేగంగా అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ నూతన విధానం ద్వారా రెండు రోజుల్లో ఒక ఆపరేటర్ నుండి మరో ఆపరేటర్ కు సులభంగా మారవచ్చు. 
 
ఒక ఆపరేటర్ నుండి మరొక ఆపరేటర్ కు మారాలంటే ప్రస్తుతం 7 రోజుల సమయం పడుతోంది. కొత్త విధానం ద్వారా వినియోగదారులు సర్వీస్ ఏరియాలో నివసిస్తూ కొత్త ఆపరేటర్ సేవలు పొందాలంటే రెండు రోజుల సమయం సరిపోతుంది. సర్వీస్ ఏరియాకు వెలుపల నివసించే వారు మాత్రం ఐదు రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. 
 
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా కోట్ల మంది వినియోగదారులు నంబర్ మారకుండానే ఒక నెట్ వర్క్ ఆపరేటర్ నుండి మరొక నెట్ వర్క్ ఆపరేటర్ కు మారుతున్నారు. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ద్వారా నంబర్ ఒక ఆపరేటర్ నుండి మరొక ఆపరేటర్ కు మార్చుకోవాలంటే ఆంగ్లంలో పోర్ట్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి పది అంకెల మొబైల్ నంబర్ టైప్ చేసి 1900 నంబర్ కు మెసేజ్ పంపాలి. ట్రాయ్ నుండి మన మొబైల్ కు ఒక కోడ్ తో కూడిన మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కోడ్ కొత్త ఆపరేటర్ కు చెప్తే కొత్త సిమ్ ఇస్తారు. ప్రస్తుతం వారం రోజుల్లోపు కొత్త సిమ్ సిగ్నల్స్ వస్తూ ఉండగా నవంబర్ 11 నుండి కేవలం రెండు రోజుల్లో కొత్త సిమ్ సిగ్నల్స్ రాబోతున్నాయి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: