జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ మొదలు పెట్టినపుడు అందరు దాని విమర్శించారు . కానీ రివర్స్ పద్ధతి కొద్దీ వరకు సత్పలితాలని ఇస్తున్నాయి అని చెప్పచ్చు .వెలిగొండ రెండో టన్నెల్‌ పనుల్లో అక్రమాలను నిగ్గు తేల్చిన నిపుణుల కమిటీ మిగిలిన పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆ మేరకు మిగిలిన పనుల విలువ రూ.553.13 కోట్లుగా నిర్ణయించిన ప్రభుత్వం గత నెల 21న రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.


వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌లో మిగిలిన పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌ సూపర్‌హిట్‌ అయింది. నాలుగు కాంట్రాక్టు సంస్థలు హోరాహోరీగా తలపడ్డాయి. వెలిగొండ ప్రాజెక్టు సీఈ జలంధర్‌ పర్యవేక్షణలో అధికారులు శనివారం ఆర్థిక బిడ్‌ తెరవగా నాలుగు సంస్థలు పోటాపోటీగా తక్కువ ధర కోట్‌ చేస్తూ షెడ్యూళ్లు దాఖలు చేశాయి.


 ఈ–ఆక్షన్‌ ముగిసే సమయానికి 7 శాతం తక్కువ ధర (రూ.491.37 కోట్లు)కు కోట్‌ చేసిన మేఘా సంస్థ ఎల్‌–1గా నిలిచింది. దీంతో ఆ సంస్థకే పనులు అప్పగించేలా సీవోటీ కి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు.చంద్రబాబు హయాంలో వెలిగొండ రెండో టన్నెల్‌ను రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ సంస్థ 4.69 శాతం ఎక్సెస్‌కు దక్కించుకున్నది. అదే సంస్థ ఇపుడు రివర్స్‌ టెండరింగ్‌లోనూ పాల్గొని అంతకన్నా తక్కువకు షెడ్యూలు దాఖలు చేసింది.


మరోవైపు గతంలో ఎక్కువ ధరకు దక్కించుకున్న రిత్విక్‌ సంస్థే ఇపుడు తక్కువ ధరకు కోట్‌ చేయడం, ఆసంస్థ కోట్‌ చేసిన ధర కంటే మరింత తక్కువ ధరకు మేఘా కోట్‌ చేసి టెండర్‌ దక్కించుకోవడం, మొత్తంగా రూ. 61.76 కోట్లు ప్రజాధనం ఆదా అవడం చూస్తే రివర్స్‌టెండరింగ్‌ విధానమనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమని మరోసారి తేటతెల్లమయిందని సాగునీటి రంగ నిపుణులు, కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: