ఒక్కోసారి మనకు తెలియకుండానే మంచి పనులు జరుగుతుంటాయి.  మంచి జరగాలని కోరుకుంటు మరొకరికి హాని చేస్తాం.  కానీ, ఆ హాని కూడా ఒక్కోసారి మంచిగానే మారుతుంది. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే జరిగింది.  అనగనగా ఓ మహిళా.. ఆమె తన 17 వ ఏట గర్భం ధరించింది.  అయితే, పెళ్లి కాకముందే గర్భం ధరించడంతో ఆమె తల్లి మండిపడింది.  పుట్టిన ఆడపిల్లను అక్కడి నుంచి తీసేసింది.  పుట్టిన ఆడపిల్ల మరణించిందని చెప్పింది. 

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆడపిల్ల పుట్టిన తేదీన పుట్టినరోజు పండుగ చేస్తున్నారు.  నిత్యం జరుగుతూనే ఉన్నది.  అలా 29 సంవత్సరాలు కాలగర్భంలో గడిచిపోయాయి.  29 ఏళ్ల తరువాత ఓ అబ్బాయి ఆ మహిళకు ఓ మెయిల్ పంపాడు.  ఎలా ఉన్నారు.. బాగున్నారా.. మీరు నా తల్లి అని ఇటీవలే తెలిసింది.  అంటూ మెయిల్ చేశారు.  మొదట ఆ మహిళ ఆ విషయాన్ని నమ్మలేదు.  పైగా తనకు పుట్టింది ఆడపిల్ల అని, ఆ అమ్మాయి పురిట్లోనే చనిపోయిందని చెప్పింది ఆ మహిళ.  


కానీ, అతను ఆమెను వదలలేదు.  పదేపదే మైళ్ళు పెట్టడం మొదలుపెట్టాడు.  తనకు పెంచుకున్న తల్లి తనకు అంతా చెప్పిందని, మీరు చనిపోయింది అనుకుంటున్న అమ్మాయి బ్రతికే ఉందని, మీ అమ్మగారు ఆ పిల్లను వేరొకరికి ఇచ్చేసిందని చెప్పారు.  అలా ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయి కొంతకాలం తరువాత లింగమార్పిడి చేయించుకొని అబ్బాయిగా మారినట్టు తెలిపింది.  దీంతో ఆ మహిళ షాక్ అయ్యింది.  చనిపోయింది అనుకుంటున్న అమ్మాయి బ్రతికే ఉందని తెలియడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  


ఆమె భర్త కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు.  తనతో కొన్ని రోజులుగా అతను మాట్లాడుతున్నారని, ఫోన్ చేసి చాలాసార్లు మాట్లాడారని, ఈ నవంబర్లో వస్తున్నట్టు చెప్పారని చెప్పాడు.  ఆ కుటుంబంలో ఇప్పుడు సంతోషాలు వెల్లివిరిశాయి.  ఇప్పటికే ఐదుగురు పిల్లలున్నా.. తన మొదటి బిడ్డ బ్రతికే ఉన్నాడని తెలియడంతో సొంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: