ఈఎస్ఐ మందుల స్కాం ఊహించ‌ని మ‌లుపులు తిరుగుతోంది. కోట్ల రూపాయ‌ల నిధుల‌ను అక్ర‌మంగా మందుల కొనుగోలుకు ఉప‌యోగించార‌నే అభియోగంతో....ఈఎస్ఐ ఉద్యోగుల‌ను అరెస్ట్ చేశార‌ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగింది. ఇటీవల ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులకు చిక్కిన  ఈఎస్ఐ జాయిట్ డైరెక్టర్ పద్మ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. విచార‌ణ‌లో ఉన్న ఆమె ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం చేశారు. నిద్ర‌మాత్ర‌లు మింగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణ య‌త్నం చేశారు. 


మందుల కొనుగోలులో 10 కోట్ల వరకు స్కామ్ ఏసీబీ అధికారులు జరిగినట్లు తేల్చారు. ఈ కేసులో 17 మంది ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్ చంచల్ గూడ జైలులో ఉన్న రిమాండ్ ఖైదీగా ఈఎస్ఐ జేడీ పద్మ ఆత్మహత్యాయత్నం చేసింది. జైలులో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన జైలు సిబ్బంది ఆమెను వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. జైలుకు వెళ్లానన్న మనస్థాపంతోనే పద్మ ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఎమర్జెన్సీ వార్డులో పద్మకు చికిత్స అందించిన డాక్టర్లు ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.


మందుల కొనుగోళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మ సూత్రధారులుగా సాగిన ఈ అవినీతి డొంకను ఏసీబీ కదిపింది. పక్కా ఆధారాలతో ఏకకాలంలో 23చోట్ల నిర్వహిస్తున్న సోదాల్లో పలు కీలకపత్రాలను ఏసీబీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఏసీబీ అధికారుల ప్రకటన ప్రకారం.. రూ.11,69,12,485 మేర అక్రమాలు వెలుగుచూశాయి. ఇదికూడా మూడు నెలల్లో జరిగిన అవినీతి మాత్రమే. గత కొన్నేళ్లుగా సాగుతున్నట్టు భావిస్తున్న ఈ కుంభకోణంలో లోతుకు వెళ్లినకొద్దీ వందల కోట్లలో అక్రమాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. వైద్యరంగానికి సంబంధించిన అంశం కావడంతో ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నది. బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకునేలా పక్కాగా దర్యాప్తు చేయిస్తున్నది. కార్మికశాఖద్వారా అందిన ఫిర్యాదుమేరకు ఏసీబీ అధికారులు ఐఎంఎస్‌లో అవినీతిని తవ్వితీస్తున్నారు. ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మ నివాసాలు సహా వివిధ ప్రాంతాల్లో సోదాలు చేశారు. ఈఎస్ఐ స్కాంలో ఇప్పటికే పద్మతో పాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఆమె కొడుకును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేవికారాని కుమారుడి సంస్థ పేరుతో మెడిసిన్ కొన్నట్టు ఫేక్ బిల్స్ సృష్టించినట్టు అధికారులు గుర్తించారు.  


 


మరింత సమాచారం తెలుసుకోండి: