మాజీమంత్రి ఆది నారాయణ రెడ్డి స్వగ్రామం దేవగుడిలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో రాజకీయ వేడిని రగిల్చింది.జమ్మలమడుగు పట్టణంలో మూతపడ్డ కొన్ని బెల్ట్ షాపులను దేవగుడిలో తెరిచారని, నిబంధనలకు అనుగుణంగా అవి పని చేస్తున్నట్లు తేలడంతో స్పెషల్ స్క్వాడ్ అధికారులు ఈ దాడులను నిర్వహించారు.జమ్మలమడుగు టౌన్ లో బెల్ట్ షాపులు మూతపడటంతో ఆది నారాయణ రెడ్డి స్వగ్రామాన్ని కేంద్రంగా చేసుకుని మళ్లీ వాటిని తెరిచారు.సుమారు 500 వరకు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.వాటి విలువ సుమారు 15 వేల రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు.


వివరాల్లోకి వస్తే ....... రెండురోజుల కిందట జమ్మలమడుగు టౌన్ లో అక్రమంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోన్న బెల్ట్ షాపులపై ప్రొద్దుటూరుకు చెందిన స్పెషల్ స్క్వాడ్ అధికారులు దాడులు నిర్వహించారు. వాటికి తాళాలు వేశారు.జిల్లాలో బలమైన రాజకీయ నాయకుడిగా ఆదినారాయణ రెడ్డికి పేరు ఉండటం, ఆయన స్వగ్రామంలో, ఆయన అనుచరులు నిర్వహిస్తోన్న బెల్ట్ షాపులపై దాడులు చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని ముందే అంచనా వేశారు.


వంద వరకు మద్యం బాటిళ్లు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.రాష్ట్రం మొత్తం నిషేధించిన బెల్ట్ షాపులు దేవగుడిలో యథేచ్ఛగా కార్యకలాపాలను కొనసాగిస్తుండటమే దీనికి కారణం.రాజకీయ ప్రాబల్యం ఉన్న మరి కొందరు విక్రయదారులు అక్రమంగా మద్యం వ్యాపారాలను నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందని, త్వరలోనే మరిన్ని చోట్ల దాడులను నిర్వహిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.


మద్యాన్ని అక్రమంగా రవాణా చేయడం, నిల్వ ఉంచడం వంటి చర్యలపై ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో.. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని అన్నారు.మద్యాన్ని అక్రమంగా విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: