తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల జేఏసీ చేపట్టిన సమ్మె  16వ రోజుకు చేరుకుంది. అయితే గత 16 రోజుల నుండి వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు నిన్న  తెలంగాణ బంద్ నిర్వహించారు. కాగా నిన్న నిర్వహించిన తెలంగాణ బంద్ సంపూర్ణం అయిందని ప్రకటించిన ఆర్టీసీ ఐకాస...  తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు . రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరకు వెళ్లి ఆర్టీసీ సమ్మెకు మద్దతు కోరనున్నట్లు  తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 23న ఉస్మానియా యూనివర్సిటీ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇక సోమవారం నుంచి సమ్మె ఉదృతం అవుతుందని హెచ్చరిస్తున్నారు ఆర్టీసీ కార్మికులు. 

 

 

 

 

 అయితే ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు జరిగినప్పటికీ కోర్టు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ.... హైకోర్టు ఆదేశాలను అటకెక్కించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మె మొదలై 16 రోజులు గడుస్తున్నా ఇప్పుడు వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల పట్ల మొండివైఖరి ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ... అధికార పార్టీ కానీ ఇప్పటివరకు ఆర్టీసీ సమ్మె పై ఎలాంటి స్పందన ఇవ్వలేదు. కాగా తాజాగా టిఆర్ఎస్ పార్టీ ఆర్టీసీ సమ్మె పై ఓ ట్విట్ పెట్టింది. తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని... అసలు  వాస్తవాలు ఇవి అంటూ ట్వీట్ పెట్టింది టిఆర్ఎస్. 

 

 

 

 

 అసలు వాస్తవాలు ఏంటి...  ఏం జరుగుతుంది అంటూ ట్వీట్ పెట్టింది టిఆర్ఎస్ పార్టీ. అయితే తన ట్విట్ లో  కొన్ని అంశాలను వెల్లడించింది. 2009 -10 నుంచి 2013 -14 వరకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆర్టిసి సంస్థకు బడ్జెట్లో కేటాయించిన నిధులు 712 కోట్లు కాగా ... 2014 -15 నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ సంస్థ కు కేటాయించిన నిధులు 4,253 కోట్లు ఇచ్చిందని  తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది టిఆర్ఎస్ పార్టీ. అయితే ప్రభుత్వం ఇచ్చిన నిధులు మునుపు కంటే  ఆరు వందల శాతం పెరగగా... ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు 67 శాతం  పెరిగాయని తెలిపింది . కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం తమకు ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు అని అనడం విడ్డూరంగా ఉందని తెలిపింది . ప్రభుత్వం కార్మికులకు అధిక నిధులు కేటాయిస్తూ జీతాలు పెంపు చేసినప్పటికీ... చట్టవిరుద్ధమైన సమ్మెతో...  కార్మికుల జీవితాలతో యూనియన్లు చెలగాటం ఆడుతున్నారని విమర్శించింది. కాగా ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీ పెట్టిన ట్విట్  వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: