కొన్ని గొడవలు వినడానికే సిల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే కర్నూల్ జిల్లాలో జరిగిన గొడవ అలాంటిదే. అసలు విషయానికి వస్తే పాఠశాలలకు కోడిగుడ్ల కాంట్రాక్ట్‌ ను దక్కించుకునేందుకు వైసీపీ నేతలు కొట్టుకున్నారు. కర్నూలు కలెక్టరేట్‌ లో ఈ ఘటన ఇటివలే జరిగింది. కర్నూలు జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ  పాఠశాలలకు సప్లై చేసే కోడిగుడ్ల టెండర్లు నందికొట్కూరుకు చెందిన యువనేత, డోన్ నాయకుడు దక్కించుకునేందుకు ప్రయత్నించారు.


అయితే కాంట్రాక్ట్ తమకు కావాలంటే తమకు కావాలని రెండు గ్రూపులు గొడవకు దిగారు. ఎవరూ తగ్గకపోవడంతో పాటు తిట్ల దండకం మొదలు పెట్టారు. దీనితో వివాదం ముదిరి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్లు కూడా రువ్వుకున్నారు. అంతే కాకుండా కర్రలతో బీభత్సంగా కొట్టుకున్నారు. ఈ దాడిలో డోన్ వైస్సార్సీపీ నాయకుడు సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. 


డీఈవో ఆఫీసు ఎదురుగే తీవ్రంగా కొట్టుకోవడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు డీఈఓ ఆఫీసులోకి కూడా రావడంతో  సిబ్బంది బెంబేలెత్తిపోయారు. ఇంతలో పోలీసుల రాకతో ఈ మూక అక్కడి నుంచి మాయమైంది. దింతో అక్కడ కాస్త అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఇది అంత ఎలా ఉన్నా కొంతమంది అధికారులు మాత్రం పై చాల గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటివి అన్ని ఉంటే బయటనే కూర్చొని మాట్లాడుకొని పరిస్కరించోకోవాలని వారు అంటున్నారు.
ప్రస్తుత డీఈఓ సాయిరాం ఈ విషయంలో కాస్త గట్టిగా స్పందించాలని మిగితా అధికారులు కోరుతున్నారు.

అయన ఇలాంటి విషయాలలో ఇంకా రాజకీయ పార్టీలు కలగా చేసుకోవడమో పార్టీ నేతలకే తెలియాలి. ఇలాంటి వ్యవహారాలను అందరికి ప్రభుత్వం కలిపించిన కానీ కొంత మంది రాజకీయ పలుకుబడులతో ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజమో ఆలోచించాలి. ఇటు వంటి చర్యల వాళ్ళ ప్రభుత్వానికి అంత మంచిది కాదు అని అనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: