ఐటీ అధికారుల దాడులు ముగిసిన నేపథ్యంలో వారు ఒక ప్రకటన విడుదల చేశారు.500 కోట్ల రూపాయలకు పైగా నగదు, 43.9 కోట్ల రూపాయల నగదు, 18 కోట్ల రూపాయల విలువ చేసే అమెరికన్ డాలర్లు, 500 కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అయితే వందల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని అక్రమంగా ఆర్జించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న కల్కి భగవాన్ కు చెందిన ఏకాం ఆలయంలో భారీగా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారు ఆభరణాలు వెలుగులోకి వచ్చాయి.1271 వజ్రాలు బంగారు ఆభరణాల బరువు 88లకు పైమాటేనని వెల్లడించారు.500 కోట్ల రూపాయలకు పైగా నగదును సీజ్ చేశారు.


రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటకల్లో కల్కి భగవాన్ ఆశ్రమానికి చెందిన 40 ప్రాంతాల్లో నివాసాలు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల సందర్భంగా వాటిని స్వాధీంన చేసుకున్నామని తెలిపారు.కొందరు బినామీల పేర్ల మీద విదేశాల్లో పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేసినట్లు తేలింది.ఇప్పటికే ఆఫ్రికా, ఖతర్ లల్లో భారీగా వ్యవసాయ పొలాలను కొన్నట్లు అధికారులు గుర్తించారు. అమెరికా, చైనా, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియాలో కొన్ని ప్రముఖ నగరాల్లోనూ వివిధ సంస్థల్లో భారీగా పెట్టుబడులను పెట్టినట్లు వెల్లడించారు.


హవాలా మార్గంలో విదేశాలకు నగదును తరలించారనే ఐటీ అధికారుల దాడులతో వెలుగులోకి వచ్చింది.దీనికంతటికీ మూలకారకులైన కల్కి భగవాన్ అలియాస్ విజయ్ కుమార్ నాయుడు, ఆయన భార్య అమ్మాజీ భగవాన్ ఏమయ్యారనే విషయం ఇంకా తేలలేదు. వారి కోసం ఐటీ అధికారులు అన్వేషణ కొనసాగిస్తున్నారు.కృష్ణాజీ ఇచ్చిన సమాచారం ఇచ్చిన ప్రాంతాల్లో వెదికినప్పటికీ.. వారి జాడ తెలియ రాలేదని తెలుస్తోంది.                   



మరింత సమాచారం తెలుసుకోండి: