అమరావతిలో రెండు ప్రముఖ సంస్థలకు జరిగిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటు న్నట్లుగా పేర్కొంది.అదే సమయంలో ఈ సంస్థలు ప్రభుత్వానికి భూ కేటాయింపుల నిమిత్తం చెల్లించిన మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన చర్చ సాగుతున్న సమయంలోనే  ఇది  మరో కీలక నిర్ణయం.

 

ఇండో..యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ , బీఆర్ షెట్టి మెడిసిటీ ప్రాజెక్టు లకు చేసిన భూ కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.విక్రమ ఒప్పందాలను కుదుర్చుకోక పోవటం వలనే కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటు న్నట్లుగా పేర్కొంది.ఆ రెండు సంస్థలు గడువులోగా పనులు ప్రారంభించలేదని.. అవి చెల్లించిన రూ 75 కోట్లు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని అధికారులు వాదిస్తున్నారు.

 

అదే విధంగా ఇండో..యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ లండన్ కు చెందిన కింగ్స్ కాలేజీ ఆస్పత్రి భాగస్వామ్యంతో మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయాలతో ముందుకు వచ్చింది. ఈ సంస్థకు భూమి కేటాయిస్తూ 2016 జూలై 4 న ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తొలి విడతలో 50 ఎకరాలు కేటాయించింది.అమరావతిలో మెడిసిటీ ప్రాజెక్టు ఏర్పాటుకు రూ.6,500 కోట్లతో ముందుకొచ్చిన బీఆర్ షెట్టి సంస్థకు 2016 డిసెంబర్ 13న ప్రభుత్వం వంద ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది.

 

అయితే, ప్రభుత్వంతో ఒప్పందం మేరకు భూములు తీసుకొని..ఒప్పందానికి కట్టుబడి ఉన్న సంస్థల విషయంలో మాత్రం జోక్యం చేసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఒప్పందాలను ఉల్లంఘించి..కేవలం వ్యాపారాల కోసమే భూములు తీసుకున్న వారి విషయంలో మాత్రం సమీక్షలో కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ఆ సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: