బోటు పొయ్యి చాలా రోజులైంది ఇప్పటివరకు దాని ఆచూకీ లేదు.బోటు ప్రమాదం లో ఇరుక్కుపోయిన వారు మాత్రం కొందరు సేఫ్ మరికొందరు అలానే అలా నీళ్లలో మిగిపొయ్యేరు.జరిగి చాలా రోజులే పోయిన కచ్చులూరు బోటు ఆచూకీ మాత్రం ఎవ్వరు కనిపెట్టలేక పొయ్యారు.

ధర్మాడి టీం అని ఒకటొచ్చింది నీళ్లలోకి వెళ్లారు.వెతికారు తిరిగారు పోరాడారు.కానీ రవ్వంత ఉపయోగం లేక పోవడం ఒక పక్క అయితే ఖర్చు పెట్టిన డబ్బంతా వృధా అయిపోయింది.కాగా మళ్ళీ ఆ తరువాత ఆపరేషన్ వశిష్ట అనే పేరుతో మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అదిగో బోటు ...ఇదిగో బోటు...అంటూ మళ్ళీ ఉత్కంఠగా మారి దొరికేసింది అని.

తీరా చూస్తే లోపలకు వెళ్లిన క్రైన్స్ కి మాత్రం పెద్ద బండరాయి తప్ప ఏమీ తగల్లేదు పైగా గవర్నమెంట్ కి డబ్బు బొక్క తప్ప ఇంకో ఉపయోగం లేకుండా పోయింది. జనం కూడా అసలు కోల్పోతున్న టైం లో పెద్ద వర్షం పడటంతో ఆశలన్నీ ఆవిరై పొయ్యాయి. దాంతో అక్కడితో ఆగకుండా వర్షాలన్ని తగ్గిపోయ్యాక మొన్నా మధ్య మళ్ళీ స్టార్ట్ చేశారు.ఉత్తరాకండ్ నుండి వచ్చిన ఈ టీం రెండు రోజులుగా చాలా చాలా ఘోరంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.

దాంతో ఇంకో గంటలో వచ్చేస్తుంది.ఇదిగో ఇంకో గంట లో వచ్చేస్తుంది. అని మళ్ళీ అసలు రేపడంతో మళ్ళీ హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇంకా ముప్పై అడుగులు లోతు మాత్రమే ఉంది కాని అందులో ఎదో ఉంది.చాలా ప్రమాదంగా ఉంది పరిస్థితి పోవడానికి భయం వేస్తోంది.అని కొత్తగా ఆపరేషన్ చేస్తున్న బ్యాచ్ నివేదిక ఇవ్వడంతో మళ్ళీ అందరి అసలు గల్లంతై అందరూ కూడా గవర్నమెంట్ వారి మీద తమ ఆవేదనను వెళ్లబుచ్చుతున్నారు.చూద్దాం బోటు ఆపరేషన్ సక్సెస్ అయి అందరిలో ఆనందాన్ని నింపాలి అని ఆశిద్దాం.

భయపడ కండి అని గవర్నమెంట్ వారు ప్రజలకు,బోటు బాధితులకు ఎంత భరోసా ఇచ్చినా వారికి బోటు బయటకి వస్తేనే మనసుకు శాంతి చేకూరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: