తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. కాగా ప్రభుత్వానికి కార్మికులకు మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టిఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా లో ఓ పోస్ట్  చేసింది. గత ప్రభుత్వాల కంటే తమ ప్రభుత్వం ఆర్టీసీకి 60 శాతం ఎక్కువగా నిధులు కేటాయించామని.. కానీ కార్మికులు చట్టవ్యతిరేకమైన సమ్మె చేస్తున్నారని ట్విట్టర్లో తెలిపింది . అయితే తాజాగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ప్రభుత్వానికి రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆర్టీసీ కార్మికుల జీతాలు భారీగా పెంచామని చెబుతున్న  ప్రభుత్వం...  ఇరవై ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఉద్యోగులకు 40, 50వేల జీతాలు  ఉన్నాయ్ అని నిరూపించగలరా అని ప్రశ్నించారు. అసలు ఆర్టీసీలో టైమింగ్ అంటూ ఉందా అని నిలదీశారు. 

 

 

 

 

 ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడైనా ఆదివారం కానీ రెండో శనివారం కానీ పండగలకి కానీ సెలవులు తీసుకున్నట్లు నిరూపించగలరా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అ డ్రైవర్ . అయితే ప్రభుత్వం ఆర్టీసీని  ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని అన్నారు. అయితే ఒకవేళ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను  ప్రైవేటుపరం చేస్తే ఆర్టీసీ సంస్థకి  ఉన్న 80 వేల కోట్ల ఆస్తులు ఎవరి  పరం చేస్తారని ప్రశ్నించారు. కరీంనగర్ లోని ఆర్టీసీ బస్టాండ్ కి వర్క్ షాప్ కి కలిపి డెబ్బై ఆరు ఎకరాల  ఉన్నదన్న  డ్రైవర్.... తెలంగాణలోని 33 జిల్లాల్లో  కూడా ఆర్టీసీకి  ఆస్తులు ఉన్నాయని ప్రజలకు తెలుసునని అన్నారు. ఆర్టీసీ తెలంగాణ ప్రజల హక్కు అని దాని కాపాడుకోవాలనే ఆ డ్రైవర్ సూచించారు. 

 

 

 

 

 అయితే ఆర్టీసీని  ప్రైవేట్ పరం చేస్తామంటున్న ప్రభుత్వం ఒకవేళ ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే ప్రజల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరా అని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ తమకు లాభాలు వచ్చే రూట్లల్లోనే  బస్సు నడుపిస్తారని పల్లెల్లో బస్సులు నడపరని...  అంతేకాకుండా బస్సులు నిండేవరకు కదలకుండా ప్రయాణికుల సమయాన్ని వృధా చేస్తారని అన్నారు. అయితే ఇలాంటి ఎన్నో సమస్యలు వస్తాయని ఇవన్నీ ఆలోచించి ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను కాపాడాలని కోరారు. తమ ప్రయోజనాలను ఆశించి సమ్మె చేయడం లేదని ఆర్టీసీ సంస్థను కాపాడడానికి ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నారని ప్రజలు అందరూ సహకరించాలని ఆ డ్రైవర్ కోరాడు.  కాగా ప్రస్తుతం  డ్రైవర్ రాసిన లేక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: