సర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తున్న హుజూర్‌నగర్ ఉపఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. టీఆర్‌ఎస్ నుం చి శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ నుంచి కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, బీజేపీ తరఫున కోట రామారావు, టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయితోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే అభ్యర్థులంతా సర్వశక్తులు ఒడ్డి ప్రచారంచేశారు.రేపు సోమవారం నిర్వహించే పోలింగ్‌కు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పుడు పోలింగ్‌పై దృష్టి సారించారు. 


అయితే, ఇదే స‌మ‌యంలో పీసీసీ చీఫ్‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డికి పోలీసులు కీల‌క ఆదేశాలు ఇచ్చారు. హుజుర్‌న‌గ‌ర్ నుంచి ఉత్త‌మ్ స‌తీమ‌ణి ప‌ద్మావ‌తి బ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే, తాజాగా పోలీసులు కీల‌క ఆదేశాలు ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసుల హుకుం జారీచేశారు. అయితే, దీనికి ఉత్త‌మ్ నో చెప్పారు. త‌న‌ను అరెస్ట్ చేసినా హుజుర్‌న‌గర్ విడిచిపోనని ఉత్తమ్ తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు ఉత్తమ్ ఇల్లు చుట్టుముట్టారు. 


కాగా, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రేపు (సోమవారం) ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.ప్రభుత్వం మెడలు వంచి ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాడుతామని ఉత్తమ్ చెప్పారు. అందులో భాగంగా సోమవారం తలపెట్టిన పెట్టిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



ఇదిలాఉండ‌గా, సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ జరుగనుండగా, ఈ నెల 24న ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 2,36,646 మంది ఓటర్లు ఉండగా 302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాట్లుచేశారు. ఇందులో 79 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్ కోసం 2,300 మంది పోలీస్ సిబ్బందితో బం దోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: