కొన్ని కొన్ని నిర్ణయాలు భలే విచిత్రంగా ఉన్నాయి.  ఎవరూ ఊహించని విధంగా ఒక్కోసారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.  ఇలాంటి నిర్ణయాలతో ప్రభుత్వం అభాసుపాలవుతుంది.  ఇప్పుడు రాజస్థాన్ అటువంటి నిర్ణయమే తీసుకుంది.  ఆ నిర్ణయం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా.. రాజస్థాన్ లో మొత్తం 69,929 పాఠశాలలు ఉన్నాయి.  ఇందులో 68,910 కో ఎడ్యుకేషన్ పాఠశాలలు కాగా, 1019 బాలికల పాఠశాలలు ఉన్నాయి.  


బాలికల పాఠశాలల్లో అనేక మంది పురుష టీచర్లు ఉన్నారు.  50 ఏళ్లలోపు ఉన్న పురుష టీచర్లను వెనక్కి పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది.  దానికి కారణాలు కూడా చెప్పింది.  50 ఏళ్ల లోపు ఉన్న ఉపాధ్యాయులపై ఈవ్ టీజింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయట.  బాలిక స్కూల్స్ లో ఉన్న పురుష ఉపాధ్యాయులను వెనక్కి పిలిపించి వారి స్థానంలో మహిళా ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం చూస్తున్నది.  


విషయం తెలిసిన పురుష ఉపాధ్యాయులు షాక్ అవుతున్నారు.  ఎక్కడో కొన్ని చోట్ల అలా జరిగితే జరిగి ఉండొచ్చుగాని, అన్ని చోట్ల అలా ఎలా జరుగుతాయని అంటున్నారు.  ఒక్కరిని దోషికిగా చూపిస్తూ ప్రతి ఒక్కరిని దండించడం సమంజసం కాదని అంటున్నారు.  తప్పుచేసి వ్యక్తులైతే.. కో ఎడ్యుకేషన్ స్కూల్ లో కూడా తప్పులు చేస్తారని, తప్పు చేయని వ్యక్తులు ఎక్కడా తప్పులు చేయరని టీచర్లు అంటున్నారు.  


ఒక్కసారిగా అంతమందిని వెనక్కి పిలిచి రీప్లేస్ చేయడం అంటే చాలా సమయం పడుతుంది.  పైగా అకడమిక్ సంవత్సరం మధ్యలో ఉన్నది కాబట్టి ఇప్పుడు మార్పులు చేయడం వలన విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలుగుతుందని టీచర్లు అంటున్నారు.  ఏదైనా ఉంటె సంవత్సరం మొదట్లో గాని, సమ్మర్ హాలిడేస్ లో గాని ఇలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని అంటున్నారు టీచర్లు.  మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: