సర్జికల్ స్ట్రైక్స్ ... ఈ పేరు వింటే ప్రతి భారతీయుడు ఛాతి 56 అంగుళాలు అవుతుంది.  రోమాలు నిక్కబొడుచుకున్నాయి.. తెలియకుండానే హృదయంలో ఒక గర్వం పొంగుతుంది.  ఎస్ మనపై దాడులు చేసిన శత్రుదేశంపై మనం కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డాం.  మనం కేవలం శాంతి శాంతి అని కూర్చుంటే సరిపోదు.. నిత్యం శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటె... ఈ ప్రపంచం చేతగాని వ్యక్తిగా జమకడుతుంది.  


ఆర్మీని చిన్నచూపు చూస్తుంది.  అందుకే ఆర్మీకి పని చెప్పాలి.. మన సత్తా చాటుతుండాలి.  అప్పుడే ప్రపంచంలో మనం అంటే గౌరవంతో పాటుగా భయం కూడా ఉంటుంది.  ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియాపై పాక్ ఒంటికాలితో లేస్తుంది.  ఇండియాలోకి ఉగ్రవాదులను పంపించి ఉగ్రదాడులు చేసేందుకు కుట్రలు పన్నుతోంది.  పాక్ పధక రచనను ఎప్పటికప్పుడు ఇండియా తిప్పికొడుతున్న సంగతి తెలిసిందే.  


ఆగష్టు నుంచి ఇప్పటి వరకు వందల సార్లు పాక్ కాల్పుల ఉల్లంఘనను అతిక్రమించి ఇండియా జవాన్లపై కాల్పులు జరిపింది.  దానిని సమర్ధవంతంగా ఇండియా తిప్పికొడుతూనే ఉన్నది.  కాగా, ఈ ఉదయం పాక్ పదేపదే ఇండియా భూభాగంవైపు కాల్పులు జరపడంతో.. ఇద్దరు భారత జవానులు, ఒక సాధారణ పౌరుడు మరణించారు.  దీంతో ఇండియన్ ఆర్మీ ఆగ్రహించింది.  పీవోకే నుంచి ఇండియాలోకి రావడానికి ప్రయత్నిస్తున్న పాక్ ఉగ్రవాదులు, వారికి సహకారం అందిస్తున్న పాక్ ఆర్మీని, ఆర్మీ పోస్టులను, ఉగ్ర పోస్టులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడం మొదలుపెట్టింది.  


ఇండియన్ ఆర్మీ పీవోకే వైపు మెరుపువేగంగా కదులుతూ.. ఆర్టిలరీ గన్స్ తో దాడులు చేయడంతో పాక్ షాక్ అయ్యింది.  ఇండియా జరిపిన ఈ సర్జికల్ స్ట్రైక్ లో ఐదుగురు పాక్ జవాన్లు, 15 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు.  పీవోకేలోని ఉగ్రస్థావరాలు, పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసింది.  ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా విధ్వంసం తప్పదు అని హెచ్చరించింది ఇండియా.    


మరింత సమాచారం తెలుసుకోండి: