హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక దాదాపుగా అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగానే మారిందని చెప్పాలి.దాదాపుగా అక్కడ తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ కూడా తన అభ్యర్థిని బరిలోకి దింపింది.హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ సహా అన్ని పార్టీల అధినేతలు ప్రచార బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. 

 

అయితే ఈ నేపథ్యంలో పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు అక్కడికి వెళ్లకుండా తనకు బదులుగా బాలయ్యను పంపుతానంటూ చంద్రబాబు చేసిన ప్రకటనపై గతంలోనే విమర్శలు రేకెత్తాయి.టీడీపీ తరఫున బాలయ్య కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం బాలయ్య పనిచేయడం లేదన్న మాట ఇప్పుడు ఆసక్తికరంగానే మారిపోయింది.

 

పార్టీ గెలిస్తే... ఆ క్రెడిట్ అంతా తనదేనని అదే పార్టీ ఓటమి పాలైతే... ఆ బాధ్యత తనది కాదని పార్టీ నేతలదేననే చంద్రబాబు ఈ రీతిలో వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పటికే పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అంతేకాకుండా హుజూర్ నగర్ లో టీడీపీకి గెలుపు కాదు కదా... కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలిసినా... బాలయ్యను ప్రచారానికి పంపుతానంటూ ప్రకటించారు. కానీ బాలయ్య మాత్రం ఏం సంబంధం లేనట్లు చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో బాలయ్య వ్యవహరించిన తీరుపై సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు వ్యూహంతో పాటుగా హుజూర్ నగర్ లో పార్టీ స్థితిగతులను బేరీజు వేసుకున్న తర్వాతే బాలయ్య అక్కడి ప్రచారానికి వెళ్లలేదన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. 

 

అంతేకాకుండా వాస్తవ పరిస్థితులు తెలిసి కూడా చంద్రబాబు తనను హుజూర్ నగర్ ప్రచారానికి వెళ్లాలని ఆదేశించడంపైనా బాలయ్య ఒకింత ఆగ్రహానికి గురవుతున్నట్లుగా కూడా సమాచారం.ఇకపై చంద్రబాబు చెబితే గుడ్డిగా ముందుకు దూకే పరిస్థితి లేదన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: