తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదహారవ రోజుకు చేరింది. అయితే ఈ నెల 19న ఆర్టీసి జెఎసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహించగా... ఆర్టీసీ కార్మికులు నిర్వహించిన బంద్ రాష్ట్రంలో పలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె  నిర్వహిస్తున్నప్పటికీ.... ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించలేదు. అయితే ఈ నెల 19న ఆర్టీసీ జేఏసీ నిర్వహించిన బంద్ విజయవంతమైందని ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ ఐకాస నేతలు.... తాజాగా తమ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. 

 

 

 

 

 ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన కార్యాచరణలో భాగంగా ఈనెల 21న రాష్ట్రంలోని అన్ని డిపోల ముందు కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొంటారు . ఈ నెల 22న తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు బస్సులు నడుపుతూ తమ పొట్టకొట్టొద్దంటూ   విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులందరు  నిరసన  ప్రదర్శన చేస్తారని  ఆర్టీసీ ఐకాస వెల్లడించింది. ఇక ఈ నెల 23న రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అందరిని  కలిసి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలపాలని  కోరనున్నారు . 24న మహిళా కండక్టర్ లతో దీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించగా... ఇక ఈ నెల 25న హైవే దిగ్బంధం రాస్తారోకోలు నిర్వహించనున్నారు ... 26న ఆర్టీసీ కార్మికు తమ పిల్లలతో డిపోల వద్ద దీక్షలు చేపట్టనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు . 

 

 

 

 

 అయితే ఈ నెల 27న దీపావళి పండుగ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు జీతాలు లేకపోవడంతో నిరసన తెలుపనున్నారు . ఇక ఈ నెల 30న 5 లక్షల మందితో సకలజనుల సమరభేరి కార్యక్రమం ఉంటుందని ఆర్టీసీ ఐకాస స్పష్టం చేసింది. కాగా  రేపటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఐకాస ఇప్పటికే ప్రభుత్వాన్ని  హెచ్చరించింది. ఆర్టీసీ ఐకాస నేతలు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం అని చెప్పినప్పటికీ... ఆర్టిసి ఐకాస నాయకులతో ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ...  కెసిఆర్ హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ చర్చల జరుపుకవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: