రోజులు ఎపుడూ ఒక్కలా ఉండవు. గతంలో జరిగినట్లుగా ఇపుడు సాగదు, కాలం అన్నింటికంటే గొప్పది. కాలం ముందు ఎవరి ఆటలూ సాగవు. గతంలో జరిగింది కదా అని ముందుకు దూకితే పీచమణిచేయడం ఖాయం. బొక్కా బొర్లా పడ్డాక గుట్టు మట్టూ తెలిసాక ఇక ఎంత గింజుకున్న కూడా ఫలితం లేదు కదా, ఉనికి సైతం గల్లంతు అవుతుంది. ఏది ఎలా ఉన్నా కూడా ఇపుడు దాయాది పాక్ కి ముప్పు పొంచి ఉంది. 


అది భారత్ నుంచే అనడంతో సందేహం లేదు. పాక్ దుస్సాహసానికి పోతోంది. ఎంతగానో కవ్విస్తోంది. ఇపుడు భారత్ కి రోజులు వచ్చాయి. ఎలా అంటే అలా ఆట‌ సాగుతుంది. ప్రపంచం కూడా భారత్ ని నమ్ముతోంది. బలమైన నాయకత్వం, పాకిస్థాన్ పట్ల స్పష్టమైన వైఖరి కలిగిన నాయకత్వం భారత్ సొంతం. అందువల్ల భారత్ ముందు కుప్పిగెంతులు వేయబోయి పాక్ చావుదెబ్బలు తింటోంది.నిజానికి పాక్ ఈ రూపూ రేఖా కూడా ఉంచుకోవాలనుకోవడం ఇష్ఠం లేనిపిస్తోంది దాని వైఖరి చూస్తూంటే. ఇప్పటికే బంగ్లాదేశ్ ని కోల్పోయిన పాక్ కి వరస గండాలే. మరో అయిదేళ్ళు చేతిలో అధికారం ఉన్న మోడీ కాశ్మీర్ ని ముక్కలు చేసినట్లే పాకిస్థాన్ని కూడా మూడు నాలుగు ముక్కలు చేసేందుకు రెడీగా ఉన్నారు. 


దాన్ని గ్రహించకుండా సరిహద్దుల్లో రెచ్చగొట్టేందుకు పాక్ రెడీ అయితే ఈ రోజు జరిగిన పరాభవమే మరిన్నిసార్లు  జరిగితీరుతుంది. ఈ రోజు ఇద్దరు జవాన్లను, ఒక పౌరున్ని చంపిన పాక్ కి భారత్ ధీటైన జవాబు ఇచ్చింది. ఏకంగా  పదిహేనుమంది ఉగ్రవాదులతో పాటు, అయిదారుగురు పాక్ సైనికులను కూడా హతమార్చడమే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను మట్టుపెట్టెసింది.
ఇక భారత్ కన్ను పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదనే ఉంది. దాని తరువాత పాక్ నుంచి బెలూచిస్తాన్ని విడిపించడం, పాక్ ని మరిన్ని ముక్కలు చేయడం ద్వారాఅసలు పాకిస్థాన్ రూపుని లేకుండా చేసేందుకు మోడీ వద్ద దిట్టమైన ప్లాన్లు ఉన్నాయి. పాక్ కి మూడిందని చెప్పడానికే ఈరోజు శాంపిల్ మాదిరిగా ఈ అటాక్స్. రానున్న రోజుల్లో పాక్ గంగవెర్రులెత్తినా కూడా ఈ మాత్రం దేశంగా కూడా మిగిలి ఉండే అవకాశాలు లేవంటే లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: