దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో కవితక్క గురించి తెలియని వారు లేరు. ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ గారి కుమార్తె అయినప్పటికిని ఈమె తెలుగు ప్రజలకు కవితక్క గా చాలా సుపరిచితురాలు.. అంతగా ప్రజల్లో ఈమె గుర్తుండిపోవడానికి కారణం ఈమె ప్రజలతో మమైకమైన తీరే.. ఆపదలో ఉన్నవారికి సాయం చేసేందుకు ఒక అడుగు ముందులో వుండే మన సీఎం గారమ్మాయి మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇద్దరికి సాయం చేశారు. ఆస్పత్రిలో, ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. 

 

వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి అనుకోని విధంగా యాక్సిడెంట్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గరలోని ఆస్పత్రులు అతన్ని చేర్చుకోలేదు. దాంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ, మధ్యతరగతికి చెందిన వ్యక్తి కావడంతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును ఆ వ్యక్తి భరించలేకపోయాడు. ఇదంతా గమనించిన సురేష్ అనే నెటిజన్.. సదరు వ్యక్తి బాధను వివరిస్తూ.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫొటోలు, బాధితుడి ఆధార్ కార్డును కలిపి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈనెల 18న సురేష్ పోస్ట్‌ను చూసిన కవిత వెంటనే స్పందించి., తన కార్యాలయం ఫోన్ నెంబర్ను పంపించారు. కవిత ఆఫీసుకు ఫోన్ చేస్తే వారి సిబ్బంది అంతా చూసుకుంటారని భరోసానిచ్చారు.

 

ఈ విషయంలోనే కాకుండా అక్టోబర్ 10న ఆస్పత్రిలో చేరి కవిత సాయం కోరిన మరో బాలికకు కూడా ఆమె సాయం చేసేందుకు వెనుకాడలేదు. ఆ బాలికకు కూడా తన ఆఫీసు నెంబర్ పంపారు. ఆ చిన్నారికి సాయం చేసేందుకు తన కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. సొంత మనుషులు ఆపదలో ఉన్నా పట్టించుకోని ఈ రోజుల్లో మన తెలంగాణ సీఎం కూతురు కవిత మాత్రం ఒకే నెలలో ఇద్దరికి తన సాయాన్ని అందించడంపై ప్రజలే కాకుండా నెటిజన్లు సైతం ఆమె పెద్ద మనసుకి సంతోషిస్తూ ఆమెను అభినందిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: