జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అంటారు.  ఈ విషయం అందరికి తెల్సిందే.  మన పెద్దవాళ్ళు ఏ సామెతలు చెప్పినా అవి ఊరికే చెప్పలేదు.  అన్ని కరెక్ట్ గా ఉంటేనే సామెతలు చెప్తారు.  లేదంటే వాటి జోలికి వెళ్ళరు.  ఆ విషయం అందరికి తెలుసు.  ప్రాణి మనుగడ సాగించే ఈ భూమిమీద అనేక చిత్రాలు, విచిత్రాలు జరుగుతుంటాయి. పైగా ఇది కలికాలం.  ఈ కాలంలో జరిగే చిత్ర విచిత్రాలు చూస్తుంటే ఎవరికైనా సరే ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది.  బాప్ రే ఇదేంటి... మరి ఇలా మారిపోయిందని ఆలోచించాల్సి ఉంటుంది.  


అందుకు ఉదాహరణలు చాలా ఉన్నాయి. కోడి, మేక, కోతులు మందు తాగడం ఎప్పుడైనా చూశారా.  ఈ కలికాలంలో మాత్రం ఇవి బాగా జరుగుతుంటాయి.  కలికాలంలో ఇలాంటి వాటికీ డిమాండ్ ఎక్కువ.  ఎందుకో తెలుసా.. వాటికీ కోసుకు తినడానికి కాదు..వాటిని వీడియోలుగా తీసి.. యూట్యూబ్ లో వాటిల్లో షేర్ చేస్తే.. మంచి డబ్బు వస్తుంది.  మంచి డిమాండ్ పెరుగుతుంది.  అందుకే అటువంటి విచిత్రమైన వస్తువుల కోసం వేట సాగిస్తుంటారు మనిషి.  


అయితే, ఇటీవలే అమెరికాలో ఓ ఎలుక పిజ్జా రుచి మరిగింది.  పిజ్జా లేకుండా అస్సలు ఉండలేక పోతున్నది.  అందుకే అవసరమైతే పస్తులు ఉందిగానీ.. పిజ్జా తినకుండా మాత్రం ఉండటం లేదు.  ఈ ఎలుక ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్ లో బాగా ఫేమస్ అయ్యింది.  ఈ పిజ్జా ఎలుక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ షేర్ అవుతున్నది.  


సరే అది ఎలుక కాబట్టి వదిలేద్దాం.  దానికి తాతాలా మారింది ఈ బొద్దింక. ఈ బొద్దింకను ధూమపానం బాగా అలవాటైనట్టుంది.  రోడ్డుపై కనిపించిన సిగరెట్ ముక్కలను లాక్కెళుతూ కనిపిస్తోంది.  ఇక వెలిగించి ఉన్న సిగరెట్ కిందపడి కనిపిస్తే అసలు వదలదు.  చెకచెకా వెళ్లి ఆ సిగరెట్ పీకను పట్టుకొని రెండు దమ్ములు లాగుతుంది.  మెల్లిగా అక్కడి నుంచి తన స్థావరానికి తీసుకెళ్తుంది.  న్యూయార్క్ లోని ఓ వీధిలో మ్యాన్ హోల్ మీద సిగరెట్ పీకను లాక్కుంటూ వెళ్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి కంటపడింది.  వెంటనే దాన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: