ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనతో పాటుగా, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుడుతూనే వుంది.. అయినా గాని వాహనచోదకులు భయం లేకుండా రోడ్లపైన పదే పదే తప్పులు చేస్తూనే ఉన్నారు..అదీగాక రోడ్డుపైన ట్రాఫిక్ సిబ్బంది లేకుంటే మరీ రెచ్చిపోతున్నారు. ఇక మీదట ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారి ఆటలు సాగేట్టు లేవు. ముఖ్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రాంగ్ రూట్ లో వెళ్ళేవారి ఆటకట్టించేందుకు సిద్దం అయ్యారు.


ఇకపోతే  రాంగ్ రూట్ లో రావడం వల్ల జరిగే ప్రమాదాలు మీకు గాని ఎదుటివారికి గాని అంతేగాకుండా ఇతర వాహనదరులకి కూడా హాని కలిగిస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్న పట్టించుకొనే వారు లేరు.. సమాజంలో ఎలా తయారు అయ్యారంటే రాంగ్ రూట్ లో వెళ్తే కేసు నమోదు చేయడమే కాదు జరిమానా కూడా విధిస్తున్నారని తెలిసి కుడా భయం లేకుండా ఇలాగే వెళ్తున్నారు. అలాంటి వారిలో రోజు 400 మంది రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.  అలాంటి వారిని గుర్తించి, వారిపై కేసు నమోదు చేయడమే కాకుండా వెయ్యి రుపాయల జరిమానా కూడా విధిస్తున్నారు.


ఈ నిఘా అక్టోబర్ ఒకటి నుండే మొదలయ్యింది.. ఇందుకోసం ఎక్కువగా రాంగ్ రూట్స్ జరుగుతున్న ప్రదేశాల్లో సైబరాబాద్ పోలీసులు 20 ప్రదేశాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి మాదాపూర్ ఎన్‌ఐఏ బిల్డింగ్, గచ్చిబౌలీ జంక్షన్, మియాపూర్ నుంచి బీహెచ్‌ఈఎల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కలిపి మొత్తం 20 రాంగ్‌ రూట్ హాట్‌ స్పాట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో నిఘాను మరింత కట్టుదిట్టంగా చేసారు. కాబట్టి వాహన చోదకులు రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసి అనవసరంగా ప్రమాదాల బారినపడకండి. మీ జేబులో డబ్బులను ఊరికే వదిలించుకోకండని హెచ్చరిస్తున్నారు పోలీసులు.  


మరింత సమాచారం తెలుసుకోండి: