మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత చంద్రబాబునాయుడు మరీ చీపైపోయినట్లే కనిపిస్తోంది. టిడిపిలో నుండి బిజెపిలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపిలు + ఒరిజినల్ బిజెపి ఎంపి చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే అదే అనుమానం వస్తోంది అందరికీ. ఫిరాయింపు రాజ్యసభ ఎంపియేమో బిజెపి-టిడిపి పొత్తులు కుదురుస్తామని అంటుంటే బిజెపి ఎంపియేమో టిడిపిని బిజెపిలో విలీనం చేసేట్లయితే అధిష్టానంతో మాట్లాడుతానని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు పరిస్ధితి దారుణంగా తయారైంది. కీలక నేతలు కొందరు టిడిపికి రాజీనామా చేసి బిజెపిలో చేరిపోతున్నారు. మరికొందరు వైసిపిలో చేరారు. ఇంకా చాలామంది నేతలు వైసిపిలో చేరటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి వారికి గేట్లు ఎత్తటం లేదు.

 

జగన్ గనుక గేట్లెత్తేస్తే 23 మంది టిడిపి ఎంఎల్ఏల్లో చాలామంది వైసిపిలో చేరటానికి రెడీగా ఉన్నారనటంలో సందేహం లేదు. కాకపోతే వాళ్ళందరినీ పార్టీలో చేర్చుకుంటే లేనిపోని తలనొప్పులొస్తాయని, ఫిరాయింపులను ప్రోత్సహించకూడదన్న కారణాలతోనే జగన్ రెడ్ సిగ్నల్ చూపుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.

 

సరే ఈ విషయాలను పక్కనపెడితే టిడిపిలో నుండి కమలం పార్టీలోకి ఫిరాయించిన నలుగురు ఎంపిలు చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఫిరాయించారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇటు జగన్ నుండి కానీ లేకపోతే కేంద్రం నుండి కానీ తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురువ్వకుండా చంద్రబాబే ఎంపిలను బిజెపిలోకి పంపారు.

 

ఎలాగూ చంద్రబాబు రక్షణ కోసమే వెళ్ళారు కాబట్టి మళ్ళీ బిజెపి-టిడిపి మధ్య పొత్తుకు సుజనా చౌదరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పొత్తుకు చంద్రబాబు రెడీ అంటే తాను బిజెపి అగ్రనేతలతో మాట్లాడుతానని సుజనా బహిరంగంగానే చెప్పారు. అంటే రెండు పార్టీలను కలపాలని సుజనా ఎంత తహతహ లాడుతున్నది అర్ధమైపోతోంది.

 

ఇక బిజెపి నేతలేమో రెండు పార్టీల మధ్య పొత్తును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కావాలంటే చంద్రబాబు తమ పార్టీలో చేరాలని అనుకుంటే చేర్చుకుంటారట. అదే సమయంలో టిడిపిని బిజెపిలో విలీనం చేయాలంటూ రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు తాజాగా సూచిస్తున్నారు. దీన్నిబట్టి చంద్రబాబు ఎంత చీపైపోయినట్లు అర్ధమవ్వటం లేదూ.


మరింత సమాచారం తెలుసుకోండి: