కాల్పుల విరమణ ఒప్పందంను ఉల్లంఘించి పాకిస్థాన్‌కు భార‌త్ ఘాటుగా బుద్ధిచెప్పింది. ముష్కర మూకల్ని సరిహద్దు దాటించేందుకు కశ్మీర్ లోని తంధార్, నౌగం, కుప్వారా సెక్టార్ల వెంట పాక్ కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారత జవాన్లు, ఓ సామాన్యుడు మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. పాక్‌స్థాన్‌కు  గట్టి బుద్ధి చెప్పేందుకు ఇవాళ ఉదయం స్ట్రాంగ్ కౌంటర్ కు దిగింది. నేరుగా పీవోకేలో ఉన్న ఉగ్ర క్యాంపులపైనే ఆర్టిలరీ గన్స్ తో అటాక్ మొదలుపెట్టింది. ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్ లను ధ్వంసం చేసింది.


ఉగ్రవాదులను సరిహద్దు దాటించి, భారత్ లోకి పంపేందుకు పాక్ ఆర్మీ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు దిగుతున్నారు. ఈ కాల్పులను తిప్పికొట్టే పనిలో భారత సైన్యం ఉంటే ముష్కరులు చొరబడొచ్చని పాక్ పన్నాగం ప‌న్నింది. ఇందులో భాగంగా...హీరానగర్ సెక్టార్ నేరుగా ప్రజల ఇళ్లపై షెల్ దాడులకు దిగారు పాక్ రేంజర్లు. ఈ ప్రాంతంలో ఒక ఇల్లు, రైస్ గోడౌన్, రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇంట్లో పిల్లలెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అన్నారు స్థానికులు. కానీ ముగ్గురు పెద్దలకు గాయాలయ్యాయని చెప్పారు. అలాగే చిత్రకూట్ గ్రామంలో ఆరు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.  భారత భూభాగంలోకి ఉగ్రవాదులను పంపేందుకు పాక్ ఆర్మీ చేసే చర్యలను భారత జవాన్లు సమర్థంగా నిలువురించారు. ఉగ్రవాద స్థావరాలను ఆర్టిలరీ గన్స్ ఉపయోగించి ధ్వంసం చేశారు. తంగ్దార్ సెక్టార్‌కు ఎదురుగా పీవోకేలోని స్థావరాలపై భారత ఆర్మీ దాడి చేసింది.


భారత భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పాక్ జవాన్లు హతమయ్యారు. పలువురు గాయాలపాలయ్యారు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని నీలం లోయలో నాలుగు లాంచ్ ప్యాడ్‌లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. పాక్‌కు లొంగ‌కుండా పైగా ఊహించ‌ని రీతిలో భార‌త్ కౌంట‌ర్ ఇచ్చింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: