ఎన్నికల అనంతరం పల్నాడులోని గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, వైసీపీనేతలు అక్కడ సృష్టించిన భయానకవాతావర ణాన్ని రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. పార్టీరాష్ట్ర కార్యాలయంలో పల్నాడుకి చెందిన వైసీపీ బాధితులకు   తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమసహాయనిధి నుంచి నగదు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మాజీమంత్రి ఆనందబాబు పార్టీ కార్యకర్తలనుద్దేశించి కీలక ప్రసంగంచేశారు.  

పల్నాడు వైసీపీబాధితుల కోసం, చంద్రబాబు నాయుడి నాయకత్వంలో ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటుచేసి, వారికి రక్షణగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పల్నాడుకార్యకర్త లు ఇళ్లు, వాకిళ్లు, పొలాలు వదిలేసివచ్చి, టీడీపీశిబిరంలో తలదాచుకున్నారని, ఆ సమయం లో పార్టీఅధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తలకు అండగా ఉంటానని, వారికి రూ. 10వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని ఇచ్చిన హామీ ప్రకారం నగదు పంపిణీ చేశా మన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీకార్యకర్తలపై ఇష్టానుసారం దాడులు, దౌర్జన్యాలుచేస్తూ, తిరిగి వారిపైనే అక్రమకేసులు పెడుతోందన్నారు. 


37ఏళ్ల పార్టీచరిత్రలో, 22ఏళ్లు అధికారంలోఉన్నా, ఎన్టీఆర్‌హయాంలోగానీ, చంద్రబాబుపాలనలోగానీ, టీడీపీ ప్రభుత్వా లు, నాయకులు, కార్యకర్తలు ఏనాడు ఇలా ప్రవర్తించలేదన్నారు. తెలుగుదేశం దాడులు, దౌర్జన్యాలు చేసుంటే, ప్రతిపక్షపార్టీలు బతికుండేవి కావని ఆనందబాబు స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, రాజ్యాంగవిరుద్ధంగా పాలనసాగిస్తోందన్నారు. 


నాయకులపై, కార్యకర్తలపై కేసులుపెడుతూ బెదిరింపులకు దిగుతున్నారని, ఉడతఊపులకు చింతకాయలు రాలవనే విషయా న్ని వైసీపీనేతలు గుర్తిస్తే మంచిదని నక్కా హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉండిపోరాడటం  టీడీపీకార్యకర్తలకు కొత్తేమీకాదని, ముఖ్యంగా పల్నాడు కార్యకర్తలు చాలా కష్టాలుపడ్డారని చెప్పారు. యరపతినేనిపై అక్రమంగా పెట్టినకేసుని న్యాయస్థానం కొట్టేసిందన్నారు. 


కార్యకర్తలను కాపాడుకోవడంలో తెలుగుదేశం ఎల్లప్పుడూ ఒకఅడుగు ముందే ఉంటుందని మాజీమంత్రి స్పష్టంచేశారు. పార్టీ, కార్యకర్తల విషయంలో అధినేత చంద్రబాబు చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. పోలీస్‌వ్యవస్థను తెలుగుదేశంపార్టీ తప్పుపట్టలేదని, కొందరు అధికారుల అత్యుత్సాహాన్నే కట్టడిచేయాలని డీజీపీని కోరామన్నారు. మాచర్ల సీఐ టీడీపీకార్యకర్తలను ఎంతదారుణంగా వేధించారో అందరికీ తెలుసునన్నారు. భవిష్యత్‌ తెలుగుదేశానిదేనని, పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తలను వెన్నంటే ఉంటుందని నక్కా ఆనంద బాబు పల్నాడువాసుల్లో ధైర్యం నింపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: