వాళ్ళు మనదేశీయులు కాదు! కాని మన దేశంలో ఒక రాష్ట్రమైన కాశ్మీర్ లో అమలులో ఉన్న రాజ్యాంగ ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ విభజనపై ఆగ్రహంతో వీళ్ళెందుకు ఊగిపోతున్నారో అర్ధం కాదు – 370 రద్దు  దరిమిలా అక్కడ పుట్టి, ప్రపంచమంతా ప్రవహించిన ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్ లోయలో భారీ కుట్రకు తెరలేపాయి. 

వీటికి తోడు పాక్ సైన్యం, వారి నిఘా విభాగం ఐ ఎస్ ఐ, తో కలసి వారి దేశంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఉగ్రవాద మూకలు - కాశ్మీర్ లో భారీ ఉగ్రదాడికి వ్యూహరచన చేస్తోందని ఇప్పటికే మన ఇంటిలెజెన్స్ బ్యూరో హెచ్చరికల మేరకు సరిహద్దుల్లో సైన్యం భారీగా భద్రతను పెంచేశాయి. అలాగే భారత్‌లో 9/11 తరహా దాడులు చేసేందుకు పథకం పన్నుతున్నారని ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన కేంద్ర హోం శాఖ:

*దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో భద్రత పెంచాలని ఆదేశించింది.
*టూరిస్ట్ స్పాట్లలో భద్రత రెట్టింపు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోమ్ శాఖ సూచించింది.
*దేశ రాజధాని ఢిల్లీలో భద్రత బలగాలు పలు చోట్ల తనిఖీలు చేపట్టారు.
*అయితే సరిహద్దుల వెంట డ్రోన్ల తో కూడా దాడులు చేసేందుకు పాక్ కుట్రలు పన్నుతోంది. 

జమ్మూ కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితో పాటు దేశవ్యాప్తంగా 30 చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే 10 మంది జైషే ఉగ్రవాదులు భారత్‌ లో చొరబడినట్లు నిఘావర్గాలు తెలిపాయి. ఇంటిలెజన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పఠాన్‌ కోట్‌, జమ్మూకశ్మీర్‌, శ్రీనగర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.  ఇటీవల పంజాబ్, గుజరాత్ సరిహద్దుల్లో ఉగ్రవాదులు ఉనికిని కూడా గుర్తించారు. తాజాగా రక్షణ స్థావరాలపై కూడా దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్లాన్లు వేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో, పంజాబ్, కశ్మీర్‌లోని రక్షణ స్థావరాల వద్ద అలర్ట్‌ ప్రకటించారు.

వీటికి తోడు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి పదే పదే తూట్లు పొడిచింది. తాజాగా నియంత్రణ రేఖ వెంబడి పాక్ జరిపిన కాల్పుల్లో ఒక సాధారణ పౌరుడు, ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ముగ్గురు పౌరులు గాయపడ్డారు. ఇప్పటికే సరిహద్దుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరిన్ని దురాగతాలకు పాల్పడుతోంది. వారం రోజుల వ్యవధిలో పాక్ సైన్యం బరితెగింపుల వల్ల నలుగురు అమాయకులు అమరులయ్యారు.  

పాక్ దాడిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం పీఓకె వెంబడి ఉన్న పాక్ ఉగ్రవాద క్యాంపులపై దాడులు నిర్వహించింది. భారత సైన్యం జరిపిన దాడుల్లో నలుగురు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ తీవ్రవాదులు మృతి చెందారు. పాక్ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసేందు కు భారత సైన్యం ఆర్టిల్లరీ గన్స్ ఉపయోగించింది. పీఓకెలోని నీలమ్ లోయలో ఉన్న మొత్తం నాలుగు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది.

ఆదివారం ఉదయం కశ్మీర్‌ లోని నియంత్రణరేఖ వెంబడి ఉన్న తంగ్ధర్ సెక్టార్‌ లోని కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడింది. పాక్ నుంచి కొంతమంది ఉగ్రవాదు లు భారత్‌ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ పాక్ చర్యలను సమర్థవంతంగా తిప్పికొట్టింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్‌పై రగిలిపోతున్న పాకిస్తాన్ ఇలా దాడులకు పాల్పడుతోంది. తంగ్ధర్ సెక్టార్‌లో పరిస్థితులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌తో మాట్లాడారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్ష జరుపుతున్నారు. 

కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ 2000 సార్లకు పైగా కాల్పులకు పాల్పడింది. పాక్ కాల్పుల్లో ఎంతో మంది సాధారణ పౌరులు,జవాన్లు గాయపడ్డారు. మరోవైపు భారత్ మాత్రం 2003 కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ కట్టుబడి ఉండాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: