అగ్రిగోల్డ్‌ బాధితులుందరికీ నిధులన్నీ ఒకేసారిచ్చి ఆదుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన జగన్‌, ముఖ్యమంత్రయ్యాక అన్నిహామీల్లానే ఆ విషయంలోనూ  వారిని మోసంచేశాడని మాజీమంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.  అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు రూ.260 కోట్లు విడుదలచేసినట్లు జీవోలో పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం  ఇచ్చిన రూ.300కోట్లను ఏంచేసిందో చెప్పాలని మాజీమంత్రి నిలదీశారు. అన్నివర్గాల మాదిరే అగ్రిగోల్డ్‌ బాధితులను కూడా వైసీపీ ప్రభుత్వం నమ్మించి మోసగించిం దన్నారు. 

రైతులు, పింఛన్‌దారులను మోసగించినట్లుగానే జగన్‌ ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితుల్ని నిలువునా ముంచిందన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ ఏంచెప్పిందో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏంచేస్తుందో సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం తాజాగా ఇచ్చిన రూ.260కోట్ల నిధుల జీవోని, తెలుగుదేశం ప్రభుత్వం ఫిబ్రవరి -28, 2019నే విడుదల చేయడం జరిగిందని ఆనందబాబు పేర్కొన్నారు. రూ.10వేల లోపు డిపాజిట్‌దారులకు సొమ్ములు తిరిగి చెల్లించడానికి రూ.250కోట్లు కేటాయిస్తూ, ఆజీవోని గతంలోనే ఇచ్చామని, ఇప్పుడు అవేనిధులకు సంబంధించి కొత్తజీవోను వైసీపీ ప్రభుత్వం జారీచేసిందన్నారు. 


జీవోలో పేర్కొన్న రూ.250కోట్లకు అదనంగా, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంద్వారా వచ్చిన మరో రూ.50 కోట్లను కోర్టుకు అందచేయడం జరిగిందన్నారు. మొత్తం రూ.300కోట్లు చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేస్తే, దానిలో రూ.40కోట్లను నొక్కేసిన రాష్ట్రప్రభుత్వం మిగిలిన రూ. 40కోట్లను ఏంచేసిందో చెప్పాలని ఆనందబాబు డిమాండ్‌చేశారు. ఎన్నికలప్రచారంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేస్తానని ఊదరగొట్టి న జగన్‌, రూ.1150కోట్లిస్తే, రూ.10వేలలోపు అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌దారులందరికీ న్యాయం జరుగుతుందని చెప్పినవ్యక్తి,  ఇప్పుడు గతపాలకులు ఇచ్చినదానిలో కూడా కోతపెట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. 


అగ్రిగోల్డ్‌ బాధితుల సంక్షేమంకోసం, గత ప్రభుత్వం సీబీసీఐడీతో విచారణ జరిపించి, డిపాజిటర్లకు న్యాయం చేయడానికి కృషిచేసిందన్నారు. ఎన్నికల్లో జగన్‌ ఇచ్చినహామీని ఆయన గాలికొదిలేశారన డానికి, రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన రూ.260కోట్ల జీవోనే తార్కాణమని మాజీమంత్రి స్పష్టంచేశారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మద్దాలిగిరిధర్‌, మాజీఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: