ఆంధ్రజ్యోతి మీడియా ఎండీ రాధాకృష్ణకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అంతగా పొసగదన్న సంగతి తెలిసిందే. అంతే కాదు. ఆంధ్రజ్యోతి మీడియా తెలుగు దేశానికి అనుకూలంగా ఉంటుందన్న పేరుంది. ఇప్పుడే కాదు.. గతంలో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలోనూ ఆ పత్రిక, మీడియా తెలుగు దేశానికి అనుకూలంగా.. వైఎస్ కు వ్యతిరేకంగా కథనాలు వండి వారుస్తుందని చాలామంది మీడియా పెద్దలు చెబుతుంటారు.


తాజాగా.. ఆంధ్రజ్యోతికి చంద్రబాబు సర్కారు విశాఖలో కట్టబెట్టిన స్థలాన్ని కూడా జగన్ సర్కారు రద్దు చేసింది. ఇప్పుడు ఈ విషయంపై రచ్చ అవుతోంది. జగన్ నిర్ణయంపై ఘటుగా స్పందించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. తన సంపాదకీయం కొత్త పలుకులో ఓ సంచలన విషయం బయటపెట్టారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో తమకు అనుకూలంగా వార్తలు రాస్తే.. హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో స్థలం ఇప్పిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడట జగన్.


ఈ విషయాన్ని ఆర్కే తాజాగా బయటపెట్టాడు. అయితే అలాంటి షరతులతో ఇచ్చే భూమి తనకు వద్దనే తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని రాధాకృష్ణ తన పత్రికలో చెప్పుకున్నాడు. మరి ఇందులో ఎంతవరకూ వాస్తవం ఉందో రాధాకృష్ణకూ జగన్ కే తెలియాలి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాధాకృష్ణ అబద్దాలు రాసే సాహసం చేయకపోవచ్చు. అందులోనూ ఇప్పుడు జగన్ మంచి కాక మీద ఉన్నారు.


అయితే ఒక వేళ వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో జగన్ ఆ ఆఫర్ ఇచ్చి ఉంటే.. అప్పుడే బయటపెట్టి ఉండొచ్చు కదా..అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే జగన్ తన వద్దకు రాయబారం పంపాడని రాధాకృష్ణ చెబుతున్నారు. ఇప్పుడు ఈ సంగతి ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయాన్ని ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు బయటపెట్టడంలో ఆంతర్యం ఏంటో.. దీనిపై వైసీపీ నుంచి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.

బే 

మరింత సమాచారం తెలుసుకోండి: