ఆంధ్ర ప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనాపరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు . 13 జిల్లాలకు 13 మంది ఇంచార్జ్ మంత్రులను నియమించారు . ఈ మేరకు  రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది  .  రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి , సంక్షేమ అమలును  పర్యవేక్షించడం కోసం ఇంచార్జ్ మంత్రులను నియమించిన జగన్, గతం లో పని చేసిన కొంతమందికి స్దాన చలనం కల్పించారు . జిల్లా ఇంచార్జ్ మంత్రులుగా కొత్తవారికి అవకాశం కల్పించిన జగన్ , పలువురికి స్థానం కల్పించకపోవడం హాట్ టాఫిక్ గా మారింది .


  శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కొడాలి నాని , విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు , విశాఖపట్నం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా కురసాల కన్నబాబు , తూర్పుగోదావరి  జిల్లా ఇంచార్జ్ మంత్రిగా మోపిదేవి వెంకట రమణ , పశ్చిమ గోదావరి జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పేర్ని వెంకట్రామయ్య , కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , గుంటూరు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా చెరుకువాడ రంగనాథరాజు , ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , నెల్లూరు జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి , కర్నూల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గా అనిల్ కుమార్ యాదవ్ , కడప జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఆదిమూలపు సురేష్ , అనంతపురం జిల్లా ఇంచార్జ్ మంత్రిగా బొత్స సత్యనారాయణ , చిత్తూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి బాధ్యతలు మేకపాటి గౌతమ్ రెడ్డి అప్పగించారు .


రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న   నూతన  సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలుకు   నూతన జిల్లా  ఇంచార్జ్ మంత్రులు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్న వాదనలు విన్పిస్తున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: