బంగారం ధర మళ్ళి భారీగా తగ్గింది. ఒక రోజు తగ్గుతూ.. మరో రోజు పెరుగుతూ వస్తుంది బంగారం. నిన్నటికి స్వలాపంగా భారీగా పెరిగిన బంగారం ధర నేడు మళ్ళి భారీగా తగ్గింది. అయితే నేడు హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 0.35 శాతం తగ్గుదలతో రూ.38,062కు చేరింది. ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర 0.30 శాతం తగ్గి రూ.36వేలకు చేరింది. అయితే  బంగారం ధర దారిలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర 0.7 శాతం తగ్గుదలతో రూ.45,228కు చేరింది. 


ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 0.25 శాతం తగ్గుదలతో రూ.38,100కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర 0.25 శాతం తగ్గుదలతో రూ.37,200కు క్షిణించింది. కాగా విజయవాడ, విశాఖపట్నంలో ధరలు కూడా ఇలానే కొనసాగుతున్నాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కాస్త పెరిగింది అనే చెప్పాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో 1,498.65 డాలర్ల పెరుగుదలతో ఔన్స 0.13 శాతం పెరిగింది. ఏది ఏమైనా ఈరోజు బంగారం ధర తగ్గడం పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. 



అయితే బంగారం ధర గత నెలకు ఈ నెలకు దాదాపు 3 వేల రూపాయిలు తగ్గింది. గత నెల అంత రోజుకు 100 రూపాయిలు, 200 రూపాయిలు తగ్గుదలతో 10 గ్రాముల బంగారం ధరకు 3 వేల రూపాయిలు తగ్గాయి. అయితే ఇదే బాటలో వెండి కూడా పయనించింది. బంగారం ధర 3 వేలు తగ్గితే వెండి ధర డబల్ తగ్గింది. ఏకంగా 6 వేల రూపాయిల తగ్గుదలతో వెండి ధర పడిపోయింది.కేజీ వెండి 51 వెయ్యి దాటినా వెండి ధర ఇప్పుడు 45 వేలకే వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: