రివర్స్ టెండరింగ్.. వైసీపీ అధినేత జగన్.. సీఎం అయిన మరునాడే బయటపెట్టిన ప్లాన్ ఇది. ఈ జగన్ ఐడియా సూపర్ హిట్ అయ్యింది. ప్రజాధనం ఆదా చేయడంలో జగన్ ప్రభుత్వం సక్సస్ అయ్యింది. కేంద్రం, విపక్షాలు వద్దు మొర్రో అని మొత్తుకుంటున్నా.. ప్రభుత్వంపై భారం తగ్గించడమే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.


ఈ విధానం ద్వారా ఇప్పటికే జగన్ పోలవరం టెండర్లలోభారీగా ప్రజాధనం ఆదా చేశారు. తాజాగా వెలిగొండ టన్నెల్ టూ టెండర్ల విషయంలోనూ ఇదే జరిగింది. ఈ టెండర్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా మరోసారి భారీగా ప్రజాధనం ఆదా అయ్యింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే దాదాపు 7 శాతం తక్కువకు కోట్ చేయడం ద్వారా మేఘా కంపెనీ ఈ టెండర్ ను దక్కించుకుంది.


రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.900 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అయిందని జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అన్ని ప్రాజెక్టుల్లో దాదాపు రూ.4 నుంచి 5వేల కోట్ల వరకు నిధులు ఆదా అవుతాయన్నారు. పోలవరం రివర్స్‌ టెండర్లలో నవయుగ సంస్థను కూడా పాల్గొనాలని ఆహ్వానించామని తెలిపారు. టీడీపీ హయాంలో టెండర్‌ పొందిన రిత్విక్‌ సంస్థ వెలుగొండ రివర్స్‌ టెండరింగ్‌లో తక్కువకే టెండర్‌ వేసిందని పేర్కొన్నారు.


నిధులు ఆదా చేసిన ప్రభుత్వాన్ని టీడీపీ నేతలు అభినందించాలన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ లేకపోతే ఈ నిధులు ఏ బాబు జేబులోకి వెళ్లేవో అందరికీ తెలుసునన్నారు. మంచి మనసున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం వలనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు కళకళలాడుతున్నాయని మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు. మొత్తం మీద రివర్స్ టెండరింగ్ ద్వారా కనీసం 4 నుంచి 5 వేల కోట్లు ఆదా చేయాలన్నది జగన్ టార్గెట్ గా ఉందన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: