తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఉత్కంఠభరితమైన ఎన్నికల పోరు ఈ రోజు జరుగుతోంది. అంతకు ముందు కాంగ్రెస్,టీడీపీ పాలనలో జరిగిన ఉప ఎన్నికల్లో విపక్ష పాత్రలో టీయారెస్ చూపించిన జోరు వేరు. ఆనాటి పరిస్థితులు వేరు. ఇపుడు ఎదురులేదనుకుంటున్న టీయారెస్ కి ఒక్క ఉప ఎన్నిక చుక్కలు చూపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా తోడు కావడంతో జనాభిప్రాయం ఎటువైపు ఉందన్న ఆలోచన ఇపుడు అందరిలోనూ కలుగుతోంది.


నిజానికి ఈ ఉప ఎన్నిక అంత ఆసక్తిని మొదట్లో కలిగించలేదు, కానీ టీయారెస్ ఏరి కోరి మరీ దాన్ని ప్రెస్టేజి గా మార్చేసింది. ఈ పరిణామంతో ఇపుడు హుజూర్ నగర్  మీదనే అందరి ద్రుష్టి పడుతోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఎలా వచ్చిందన్నది తెలిస్తే గెలుపు ఎటువైపో ఓ విధంగా చెప్పవచ్చు. అక్కడ 2018 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో గెలవడంతో రాజీనామా చేశారు. ఆ విధంగా ఉప ఎన్నిక వచ్చిపడింది.


పైగా అది ఉత్తం కుమార్ రెడ్డి సొంత సీటు, కాంగ్రెస్ కి బలమున్న సీటు, ఉత్తర తెలంగాణాలో టీయారెస్ కి బలహీనమైన సీటు కూడా అదే. అయితే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ సీటుని కూడా గెలవాలనుకుంటున్నారు టీయారెస్ అధినేత కేసీయర్. మరో వైపు అక్కడ పోటీలో ఉన్నది సాక్ష్తాత్తూ పీసీసీ చీఫ్ సతీమణి పద్మావతిరెడ్డి. దీంతో ఈ సీటుని టీయారెస్ గెలుస్తుందా అన్న డౌట్ మొదట్లోనే వచ్చేసింది.


దానికి తోడు అన్నట్లుగా వరసగా జరిగిన అనేక పరిణామాలు టీయారెస్ వీక్ పాయింట్లను బయటపెట్టాయి. ముఖ్యంగా  ఆర్టీసీ సమ్మె మాత్రం చాలా దెబ్బ తీసేలా ఉంది. జనాభిప్రాయాన్ని అది ప్రతిబింబించే విధంగా ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఉంటాయని అందరూ అంటున్నారు. దానికి తోడు పెరిగిన ప్రజావ్యతిరేకత, బలమున్న సీపీఐ ముందు మద్దతు ఇచ్చి తరువాత వెనక్కు పోవడం వంటి పరిణామాలు తీసుకుంటే మాత్రం టఫ్ ఫైట్ జరగనుందని తెలిసిపోతోంది. అక్కడ కాంగ్రెస్ గెలిచి టీయారెస్ ఓడితే మాత్రం భారీ రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: