జగన్ సర్కార్ కేవలం మూడు నెలల తేడాలోనే ఇంచార్జి మంత్రులను మార్చేసింది. ఇది నిజంగా షాకింగ్ పరిణామమే. కాంగ్రెస్ హయాంలో కానీ, టీడీపీ జమానాలో కానీ ఇంచార్జి మంత్రులను కనీసం సంవత్స‌రం అయినా కొనసాగించేవారు. ఎందుచేతంటే వారు జిల్లాలోని పార్టీ, ప్రభుత్వాన్ని కలుపుకుని ముందుకు సాగడమంటే  ఓ విధంగా టఫ్ టాస్క్. అందుకు వారికి కొంత సమయం కూడా కావాలి. మరి జగన్ మాత్రం ఇలా వేసి అలా తీసేశారు. కారణం అన్నది మాత్రం ఆలోచిస్తే చాలానే కధ ఉందని అంటున్నారు.


అసలు మంత్రులు కొన్ని జిల్లాల్లో పనిచేయడంలేదు. వారు స్త‌బ్దుగా ఉండిపోతున్నారు. దాంతో కొసరు మంత్రులుగా ఇంచార్జిలను  పెట్టడం వల్లా ఆయా జిల్లాల్లో ఇటు పార్టీ, అటు ప్రభుత్వం పరుగులు తీస్తుందని అంటున్నారు. మరో వైపు ఇపుడు నియమించిన ఇంచార్జి మంత్రులు కూడా ఆయా జిల్లాలలో రాజకీయ, సామాజిక పరిస్థితులను బేరీజు వేసుకుని మరీ నియమించారని అంటున్నారు.


విశాఖ రాజకీయమే చూసుకుంటే అక్కడ ఇంచార్జిగా కన్నబాబుని పెట్టారు. కన్నబాబు బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. పైగా దూకుడుగా రాజకీయం చేస్తారు. విశాఖలో కాపులకు ఎక్కువ ప్రాధ్యాన్యత ఉంది. పైగా అక్కడ టీడీపీ ఫోకస్ కూడా ఉంది. మరో వైపు ఢీ అంటే ఢీ అంటూ కౌంటర్లు ఇచ్చే నాయకులు వైసీపీ వైపు  పెద్దగా లేరు. అటువంటి చోట కన్నబాబుని దింపితే పార్టీ పరుగులు పెడుతుందని అంటున్నారు.


ఇదే విధంగా శ్రీకాకుం జిల్లాలో కొడాలి నానిని ఇంచార్జి చేశారు. నాని సైతం డేరింగ్ రాజకీయాలు చేస్తారు. అక్కడ ఉన్నది మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. ఆయన్ని ఢీ కొట్టాలంటే కొడాలి కరెక్ట్ అని ఆలోచించి పెట్టారని అంటున్నారు. విజయనగరంలో బొత్స, కొలగట్ల వర్గాల మధ్య పోరు ఉంది. కొలగట్ల సామాజికవర్గానికి చెందిన వెల్లంపల్లిని ఇంచార్జిని చేయడం ద్వారా పొలిటికల్ గా  బాలన్స్ చేస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: