జగన్ చాలా రోజులుగా ఢిల్లీ వెళ్తున్నారు.. వస్తున్నారు.. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లానని అన్ని సిద్ధం చేసుకున్నా.. చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది.  కారణం ఏంటి అంటే.. ఒక్కటే కారణం.. ఢిల్లీలో అయన లేకపోవడం.  అయన అపాయింట్మెంట్ కోసం జగన్ చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు.  ప్రధాని మోడీ అందుబాటులో ఉన్నారు కాని, అయన మాత్రం దొరకడం లేదు.  ప్రధాని మోడీ కంటే అయన చాలా బిజీ అయ్యారు.  అయన ఎవరో ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది. 


ఇంకెవరు బీజేపీ చీఫ్, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా.  మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అయన బిజీ అయ్యారు.  పార్టీకి సంబంధించిన  పనుల్లో తీరికలేకుండా ఉన్నారు. ఈ బిజీ కారణంగానే అయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.  ఒకవేళ ఇచ్చినా.. చివరి నిమిషంలో క్యాన్సిల్ చేసుకుంటున్నారు.  హడావుడిగా కలవడం కంటే.. ఎన్నికల తరువాత కలిస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నారు.  అందుకే వైఎస్ జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.  కాదుకాదు దొరకలేదు.  


కాగా, ఇప్పుడు ఎన్నికల ప్రచారం ముగిసింది.  ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి.  కాబట్టి ఇప్పడు పెద్దగా పార్టీకి సంబంధించిన పనులు ఉండవు.  దీంతో షా అపాయింట్మెంట్ దొరికినట్టు తెలుస్తోంది.  ఈరోజు జగన్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు.  షా ను కలిసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విషయాలను మాట్లాడబోతున్నారు.  రాష్ట్రసమస్యల గురించి చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి.  


వాటిని హోంశాఖ మంత్రి ముందు ఉంచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్ ముందు ఉన్నది.  వాటిని ఆయనకు వివరించి.. సమస్యల పరిష్కారానికి మార్గం కోరే అవకాశం ఆనంది.  విభజన సమస్యల్లో ఉన్న సమస్యల గురించి కూడా జగన్ మాట్లాడే అవకాశం ఉన్నది.  వీలైనంతగా అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొని, అన్ని పనులను చక్కబెట్టుకొని రావాలని జగన్ ఢిల్లీ వెళ్తున్నారు.  అయితే, ఢిల్లీలో షా ఒక్కరితోనే మీటింగ్ ఉంటుందా లేదంటే.. కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నదా అన్నది తెలియాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: