ప్రధాని మోడీ పర్యావరణం విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు.  తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.  ఎలాగైనా పర్యావరణాన్ని రక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఇందులో భాగంగానే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు.  దీనికి అనేకమందినుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  చాలామంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిగాన్ని తగ్గించేశారు.  సింగిల్ యూపీ ప్లాస్టిక్ బ్యాన్ చేయడం వలన పర్యావరణ పరిరక్షణ జరగదని అంటున్నాడు పూరి జగన్నాధ్.  


అంటేంది అంటే.. దానిపై మోడీకి ఓ పెద్ద లేఖ రాశారు.  ఆ లేఖ చూస్తే.. పూరికి కూడా పర్యావరణంపై ప్రేమతో పాటుగా మోడీపై ప్రేమ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను రద్దు చేయడం వలన గుడ్డ, పేపర్ సంచులు ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది.  దానికి ప్రత్యామ్నాయం ఇదే కాబట్టి వాటికోసం చెట్లను నరుకుతారు.  ఫలితంగా భూమిపై భూతాపం పెరుగుతుంది.  


దీనివలన వచ్చే నష్టాలు ఎక్కువగా ఉంటాయి.  అంతేకాదు 1960ల్లో ప్లాస్టిక్ కనిపెట్టి, ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఇది మనిషి అద్భుత సృష్టి అని ప్రజలు భావించారు. ఎందుకంటే అప్పటి వరకు పేపర్ బ్యాగులను ఎక్కువగా వాడేవారు. ప్లాస్టిక్ బ్యాగులను చాలా సులభంగా తయారుచేయడమే కాదు.. అవి ఎక్కువకాలం మన్నుతాయి, దృఢంగా ఉంటాయి. ప్లాస్టిక్‌ను వాడటం మొదలుపెట్టడం వల్ల నిజానికి మనం చాలా చెట్లను, అడవిని కాపాడాం. దాని వల్ల పర్యావరణాన్ని కాపాడటంతో పాటు జీవావరణాన్ని బ్యాలన్స్ చేయగలిగాం.అని పూరి లేఖలో పేర్కొన్నారు.  


భూమిపై వాతావరణ కాలుష్యానికి ప్రధాన కారణం పరిశ్రమలు, వాహనాల నుంచి వస్తున్న పొగ ఒక ప్రధాన కారణం అని పూరి లేఖలో పేర్కొన్నారు.  అంతేకాదు, రెండు శతాబ్దాల క్రితం జనాభా రెండు బిలియన్ గా ఉంటె.. ఇప్పుడు 8 బిలియన్ గా మారిందని, దీంతో పాటు పశువుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని అన్నారు.  ఇప్పుడు ప్రధానంగా చేయాల్సింది జనాభా నియంత్ర అని, దీంతో పాటుగా మాంసాహారం తగ్గించాలని, కాయగూరలను ఎక్కువుగా తీసుకునే విధంగా ప్రోత్సహించాలని పూరి పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని అడవులను పెంచాలని చెప్పారు.  జనాలకు లెక్చర్లు ఇస్తే పట్టించుకోరని, వారికి జ్ఞానం కలించాలని అన్నారు.  ప్లాస్టిక్ కు డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్తే వాటిని బయటపడేయకుండా.. ఇంట్లోనే ఉంచి పోగుచేసి తీసుకెళ్లి ఇస్తారని, అలాంటివి చేస్తేనే పర్యావరణం రక్షించుకునే అవకాశం ఉందని అన్నారు పూరి.  మరి పూరి రాసిన భారీ లేఖపై మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: