ఇండియా శాంతిని కోరుకుంటుంది.  అదే మనకు వరం అనుకున్నారు.  కానీ, శాంతి శాంతి అని వల్లించుకుంటూ పోతుంటే.. ప్రపంచంలో భారతదేశం అగ్రరాజ్యల సరస నిలిచేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది.  శత్రువుల చేతుల్లో చులకన కావాల్సి వస్తుంది.  శాంతి వహించాలి.  అవసరమైన చోట పులిలా గాండ్రించాలి.  సింహంలా భయపెట్టాలి.  అవసరమైతే అమెరికాల ఆంక్షలు కూడా విధించాలి.  అప్పుడే మనదేశం పట్ల భయభక్తులు ఉంటాయి.  


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా.  అదే విధంగా ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛ మరేదేశంలో లభించదు.  అతి స్వేచ్ఛ కూడా ఒక్కొక్కప్పుడు అనర్ధాలు తెచ్చిపెడుతుంది.  ప్రతి దేశంలో ఆ దేశం గురించి పౌరులు తప్పుగా మాట్లాడితే వారికీ కఠిన శిక్ష ఉంటుంది.  కానీ, మనదేశంలో అలా కాదు. పెద్దగా పట్టించుకోరు.  ఈ పరిస్థితి మారాలి.  ప్రతి ఒక్కరు దేశాన్ని గౌరవించేలా చేయాలి.  దేశం గురించి తెలుసుకునేలా ప్రతి ఒక్కరికి బోధించాలి.  ఎంత స్వేచ్ఛ ఉన్నా ఆ స్వేచ్ఛను పక్క తోవ పట్టించకుండా ఉండేందుకు విధిగా అన్ని చర్యలు తీసుకోవాలి.  


ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడిప్పుడే ఇండియాలో మార్పులు వస్తున్నాయి.  2014 నుంచి ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.  గతంలో కంటే ఇప్పుడు పక్కనున్న శతృదేశలపై ఇండియా ఉక్కుపాదం మోపుతున్నది.  ముష్కరులపై విరుచుకుపడుతుంది.  బోర్డర్ విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించడం లేదు.  జాతీయ భద్రత విషయంలో ఇండియా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.  ఇటీవల ఐరాసలో ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన టర్కీ మాట్లాడిన సంగతి తెలిసిందే.  


అంతేకాదు, సిరియా విషయంలో టర్కీ కలుగజేసుకోవడం.. అక్కడి అమాయక ప్రజలపై సిరియా క్షిపణి దాడులు చేయడంతో ఇండియా ఆగ్రహించింది.  టర్కీలో జరగాల్సిన సదస్సును ఇండియా రద్దు చేసుకుంది.  ప్రధాని తన టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు.  టర్కీ పర్యటనను రద్దు చేసుకోవడంపై చాలామంది హర్షం వ్యక్తం చేశారు.  ఇండియన్ టూరిస్టులు టర్కీ వెళ్లకూడదని, అక్కడి వెళ్లే టూరిస్టుల్లో ఎక్కువ శాతం ఇండియన్స్ ఉంటున్నారని చాలామంది మంది అంటున్నారు.  పాక్ కు సపోర్ట్ చేస్తూ.. ఇండియాను వ్యతిరేకిస్తున్న టర్కీ సంబంధాలు తెంచుకోవాలని కేంద్రంపై చాలామంది ఒత్తిడి తెస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: