మీడియా ఒక అనామకుణ్ణి హీరో చేస్తుంది. అదే మీడియా తనకు నచ్చకపోతే ఆ హీరోనే కాదు ఇంకో హీరో నైనా అధఃపాతాళం లోకి తొక్కేస్తుంది. అయితే రాజ‌కీయ నాయ‌కుల కు అనుక్షణం అనుసరించే వాళ్లుండాలి – అంటే ఫాలోయింగ్ అన్నమాట.  కొందరు "మీడియా ఎడిక్ట్స్" ఉంటారు వాళ్ళు ఏ ఒక్క రోజు మీడియాలో కనిపించకపోయినా  చానల్స్ లో ఏ ఒక్కరోజు త‌మకు సంబంధించి వార్తలు కానీ,  ఫొటో కానీ న్యూస్ పేపర్లోనో, టివి చానల్లోనో క‌నిపించ‌క‌పోయినా వాళ్ళు బిక్కచచ్చిపోతూ ఉంటారు. ఆకలై సమయానికి పాలు అందకపోతే పసిపిల్లలు ఎలా అల్లాడిపోతుంటారో! అలా అన్నమాట. 

ఏదైనా ప్రత్యేక సందర్భంలో తమ వార్తలు ప్రచురింపబడాలని, తమ కార్యక్రమాన్ని టివిలో టెలికాస్ట్ అవ్వాలని కోరుకోవటం సహజం. అలాకాదు ప్రతిరోజు తమ వార్తలతో తామె ముఖచిత్రాలో, హెడ్ లైన్స్ లో ఉండాలనుకోవటం ఒక రకమైన జబ్బే. ఆ జబ్బుతో కృశించేవాళ్లలో ముందు వ‌రుస‌లో ఉంటారు టీడీపీ అధినేత, మాజీ ఏపి ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు. అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న త‌నతో మీడియాను మంది మార్బలంతో ప్రత్యేకంగా తిప్పుకొనేవారు. అవ‌స‌రం ఉన్నా లేకున్నా కూడా మీడియాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. 
Image result for chandrababu & Telugu media
ఆఖరకు తన స్వగ్రామంలో సంక్రాంతి పండగ జరుపుకున్నా, తాను సినిమా థియేటర్ కు వెళ్ళినా, చివరకు త‌న మ‌న‌వ‌డితో ఆడుకుంటున్నా కూడా ఆ కార్యక్రకం మీడియా క‌వ‌రేజ్ చెయ్యాల్సిందే. 

పాల‌న‌కు సంబంధించి, ప్రతిప‌క్షాలకు సంబంధించిన విష‌యాల‌ను ఆయ‌న పుంఖాను పుంఖాలుగా మీడియాలో గంట‌ల త‌ర‌బ‌డి మాట్లాడేవారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత ప్రతిప‌క్షానికే ప‌రిమిత‌మ‌య్యారు. ఈ సమయంలో ఆయన పగలబొడిచే కార్యక్రమాలేముంటాయి? అయినా కూడా ఆయ‌న కొన్ని స్వ- సమాజానికి చెందిన పత్రికల్లో టీవిల్లో ప్రతిక్షణం ప్రతి న్యూస్ ప్రేముల్లో కనిపిస్తూ నిరంతర ప్రచార స్రవంతిని -  మీడియా నుంచి ఆశిస్తూనే ఉంటారు. 

ఒక అగ్ర రాజ‌కీయ నాయకుడుగా, పార్టీకి అధినేతగా ఆయనకు లభించాల్సిన ప్రచారం మీడియాలో లభిస్తూనే ఉంటుంది - ఆయ‌న మీడియా ముందుకు రావాలంటే ఏదైనా “విషయం” ఉండాలి.  ఆయ‌న మాట్లాడేందుకు పెద్దగా “విషయం” క‌నిపించ‌దు. ఆయన కనిపించటానికి ఏదో  విషయం సృష్టించబడాలి - రాష్ట్రంలో జ‌గ‌న్మొహనరెడ్డి పాల‌న‌ను విమర్శించటం తప్ప వేరే ఏముండదు. కారణం ఆయన జగన్ వైపు ఒక వేలు చూపితే మిగిలిన ఆయన స్వంత వేళ్ళే ఆయనను చూపిస్తూ ఉంటాయి. ఆందుకే:
Image result for chandrababu & Telugu media
*ఒక పదిహేనురోజులు కోడెల ఆత్మహత్యపై నానాయాగీ చేశారు. ఆత్మహత్య చేసుకోవటం పిరికివాడి లక్షణం. శాసనసభలో ఆయన తీరంతా అప్రజాస్వామికమే. నైతికతకు ఎక్కడా ఆయన స్థానం యివ్వలేదు. ఆయన కోసం మీడియా ముందు చెలరేగి పోయిన చంద్రబాబు చివరకు "వీడింతే" అన్న స్థాయికి పడిపోయినా - ఆయన సామాజిక మీడియా జాకీలువేసి నిలబెట్టటానికి ప్రయత్నించింది. కుళ్ళికృశించిన చక్కశిల్పాన్ని జాకీలు కాపాడకపోగా - వాటి గొప్పతనాన్ని క్రమంగా కోల్పోతున్నాయి.  


*కొన్ని రోజులు రివ‌ర్స్ టెండ‌ర్లను ప‌ట్టుకుని వేలాడారు. దీనిలో₹ 865 కోట్లను లాభంగా ప్రభుత్వం చూ పించేస‌రికి ఈ స‌బ్జెక్టును వ‌దిలేశారు. 


*కొద్ది రోజులుగా గ్రామ వ‌లంటీర్లు, స‌చివాల‌యాల‌ను జ‌గ‌న్ ప్రభుత్వం ప్రారంభించగా, వీటిని కూడా త‌న‌ స్వార్ధ ప్రయోజనా లకు  అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయ‌త్నించారు. గ్రామ వ‌లంటీవ‌ర్ల వ్యవ‌స్థను తామే ప్రారంభించామ‌ని చంద్రబాబు చెప్పినా, ఎవ‌రూ విశ్వసించలేదు సరి కదా! జనం  చీ కొట్టటంతో ఉప‌యోగం లేకుండా పోయింది.


*టిడిపి కార్యక‌ర్తల‌పై దాడులు చేస్తున్నారంటూ, మరో కొత్త విషయం సృష్టించారు.  అదే స‌మయంలో పోలీసుల‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయ‌న వ్యాఖ్యలు వివాదాస్పదం కావ‌డం, వీటికి వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డంతోనే ప‌రిస్థితి దిగజారి పోయింది. 


*ఇక రైతు భ‌రోసా ప‌థ‌కంపై కూడా అనేక ఆరోప‌ణ‌లు చేయాబోగా - ప్రభుత్వం ఆ అవ‌కాశం ఇవ్వకుండా రాష్ట్రంలోని 54 ల‌క్షల మంది రైతుల‌కు దీనిని అమ‌లు చేస్తామ‌ని ప్రక‌టించింది. 


*పోలవరం అమరావతి “విషయాలు” ఎన్ని సార్లు తీసినా అందులో ఆయన గోతులేకాదు, సొరంగాలు కూడా బయట పడుతున్నాయి. 
Image result for chandrababu & Telugu media
తానే అవినీతి పునాదులపై నిర్మించిన ఒక అక్రమ నిర్మాణ గృహంలో నివాసముంటూ ఎదుటి వారినేమి ప్రశ్నించగలరు? ఆయినా కిందపడా తనదే పైచేయి అనేవారిని జనం “చూసీ చూడనట్లు వదిలేశారు” కాని ఆయన్ను అనుకషణం కుడి ఎడమల డాల్ కత్తులు మెరయగ అన్నట్లు తోడొచ్చే కుల మీడియా సంరక్షణ రాజకీయ జీవనం గడిపేస్తున్నారు.  అద్దాల మెడలో ఉంటూ ఎదురింటిపై రాళ్ళేస్తే - జరిగే దుష్పలితమే సంప్రాప్తమైంది. "అయ్యోపాపం!" అనే "స్వ-కులేతరులు కాని స్వ-జనేతరులు"  లేకపాయే! అదీ ఆయన దుస్థితి. 


ఆయనకు మీడియా పంచప్రాణాలు. ఆయన శౌర్యం, ధైర్యం, సాహసం, ధీరం, సామర్ధ్యం అంతా మీడియా సృష్టే! లేకుంటే సత్యనాదేళ్లను నేనే సాఫ్ట్-వేర్ ఇంజనీర్ని చేశాను అని ఎలా అంటారు? ఏమీ లేకపోయినా చెయ్యకపోయినా మనవెంట "ప్రసారమాధ్యమం అనే వందిమాగధ దళం" ఉంటే కనీసం రాజకీయంగా చావకుండా జనాలకు నిత్య దర్శనం ఇవ్వచ్చు. ఇఈక చంద్రబాబు “విషయం” కోసం ఎదురుచూడనవసరం ఉండదు అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆ మాద్యమాలు ఈ రోజు బాబుగారు బ్రేక్ ఫస్త్ చెశారు, లంచ్ చేశారు, డిన్నర్ చేశారు అంటూ రాస్తూనే ఉంటాయ్ ఎందుకంటే “ఆద్స్ పేరుతో దోచేసింది కాస్తా కూస్తానా? ఓక జీవితానికి సరిపడా దోచేశారు” 
Image result for chandrababu residence in amaravati
అలాగే మీడియా భవనాలకు భూములు కారు చౌక ధరల్లో కొట్టేశారు. ఖావాల్సిన వాళ్ళకి కాంట్రాక్టులు ఇప్పించుకున్నరు. ఇప్పుడు అధికారం కోల్పోయే సరికి చంద్రబాబు కు కేంద్రంతో సయోధ్య నెరపటానికి హస్తిన రాయబారాలు చేస్తూ - బ్రోకర్ పనులు చేస్తుంది. ఇలాంటి మీడియా ప్రజాస్వామ్య వ్యవస్థను అవస్థల పాలు చేయటం తప్ప – దానికి నాలుగవ స్థంభం కాలేదు. అందుకే సోష‌ల్ మీడియా లో సెటైర్లు పేలుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: